Thursday, December 12, 2024

Ys jagan:ప్రతిపక్ష హోదా లేకపోయినా.. జనంతో నడిచి..

- Advertisement -

Ys jagan:గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి చవి చూసింది. ఒంటరిగా వైసీపీని ఏమీ చేయలేక కూటమిగా ఏర్పడి గెలిచామని అధికార పీఠం ఎక్కింది టీడీపీ. ఈ క్రమంలో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న వరద విపత్కర పరిస్థితుల్లో వైసీపీని నిందించడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వరదలు ఎక్కువైనా, చెరువులకు గండి పడినా గత ప్రభుత్వ వైఫల్యమే అని టీడీపీ కూటమి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం సబబుగా లేదు. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు వీస‌మెత్తు సాయం కూడా అందించ‌లేదని దుమ్మెత్తి పోయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏ మాత్రం సరికాదు. ఇంత జరిగినా కూడా అధికారంలో లేకపోయినా వైఎస్ జగన్ ఇటీవల కృష్ణలంక ఏరియాలో పర్యటించి కృష్ణలంక వాసులతో మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

గత ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌లేదు. దీనికోసం వైసీపీ నిరంతరం న్యాయ పోరాటం చేస్తోంది. ఇదే విష‌యమై తరచుగా స్పందిస్తున్న మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఉంటేనే ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప‌ని చేయ‌గ‌ల‌మ‌ని అన్నారు. అధికారంలో లేనప్పుడు త‌మ మాట ఎవ‌రూ వినిపించుకోర‌ని.. మాట్లాడే అవ‌కాశం కూడా ఇవ్వ‌రని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అధికారం అనే మాట పక్కనపెట్టి ప్రజల బాగోగులు చూసే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. వైసీపీని ఎంతో మంది నేతలు వీడిపోతున్నా జగన్ కుంగిపోకుండా ఉండడం వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నాయి వైసీపీ శ్రేణులు. అదే వైసీపీ ధీమాకు మరో కారణం. ఏది ఏమైనా అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్ష పాత్ర ఇచ్చి గుర్తించడానికి టీడీపీ కూటమి ఒప్పుకోనంటుంది. ఏపీలో తామే ఏకైక ప్రత్యామ్నాయం కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకే ఇవ్వాలని, దానికి సీట్లతో నంబరుతో సంబంధం ఏంటని వాదించడం సబబుగానే ఉంది కదా..!

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!