Thursday, December 12, 2024

Ys jagan- Chandrababu:చంద్రబాబు ప్రభుత్వం ఎలా విఫలమైందో ఆధారాలతో సహా నిరూపించిన జగన్..!!

- Advertisement -

Ys jagan- Chandrababu:విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను బుధ‌వారం పరిశీలించారు మాజీ సీఎం జ‌గ‌న్‌. ఈ సందర్భంగా స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని అన్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని విమ‌ర్శించారు. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. చంద్ర‌బాబు త‌న ప్ర‌చారం కోసం వ‌ర‌ద నీటిలో తిరిగార‌ని ఇది సరైన పాల‌న కాదని తప్పుపట్టారు. ఇలాంటి సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్పుడు అధికారుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపించాల‌ని అన్నారు.

త‌మ హ‌యాంలో కూడా వ‌ర‌ద‌లు వ‌ర్షాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. అయితే తాము కొంత గ‌డువు ఇచ్చి ఆ స‌మ‌యంలోగా ప‌నులు చ‌క్క‌దిద్దాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. ఆ త‌ర్వాత‌ త‌ను పరిశీలించాన‌ని, ప్ర‌చారం కోసం ఎప్పుడూ తహ‌త‌హ‌లాడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం లేద‌న్నారు. ప్ర‌భుత్వం విఫలం కాలేద‌ని యంత్రాంగంలోనే కొంత అలసత్వం క‌నిపించింద‌ని దానిని ప‌ట్టుకుని మొత్తం ప్ర‌భుత్వంపై ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏంట‌ని నిప్పులు చెరుగుతున్నారు.

బాధ్య‌తాయుత ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు బాధిత ప్రాంతాల‌కు వెళ్తే ప్ర‌భుత్వం త‌మ‌కు అండ‌గా ఉంద‌న్న భావ‌న‌ మరియు భ‌రోసా బాధితుల‌కు ద‌క్కుతాయ‌ని ప్యాలెస్‌ల‌లో కూర్చుని కాలం గ‌డ‌ప‌డం అలాగే క‌లెక్ట‌ర్ల‌కే బాధ్య‌త‌లు అప్ప‌గించి చేతులు దులుపుకోవ‌డం చేయ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంలో జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి బాధితుల‌తో సెల్ఫీలు దిగ‌లేదా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు నీతులు చెప్ప‌డం కాద‌ని బాధితుల‌ను ఆదుకునేందుకు వైసీపీ నాయ‌కులు ఏం చేశార‌ని వారు నిల‌దీస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు గుప్పెడు ఆహారాన్ని బాధితుల‌కు అందించేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని వీరి కంటే ఇత‌ర ప‌క్షాలు న‌య‌మ‌ని టీడీపీ నాయ‌కులు తిట్టిపోశారు. ప్ర‌భుత్వం స‌రిగానే ప‌నిచేస్తోంద‌ని అందువల్లే ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ హ‌యాంలో ఎంతోమంది చ‌నిపోయార‌ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రాణ న‌ష్టం పెద్ద‌గా జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అంటున్నారు. జ‌గ‌న్ ఏం మాట్లాడినా చెల్లుతుంద‌ని అనుకుంటున్నార‌ని అసలు ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఎప్పుడో ప‌క్క‌న పెట్టార‌ని ఎద్దేవా చేశారు.

యంత్రాంగంలోనే కొంత అలసత కనిపించింది అని స్వయంగా అధికార పార్టీ నాయకులే చెప్పడంతో వైసీపీ పార్టీ నాయకులకి విమర్శించడానికి మరొక కారణం దొరికింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా అని చెప్తుంటే ఇక యంత్రాంగంలో అలసట ఎందుకు వచ్చింది అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క ఆహరం వృధాగా పోతుంటే కొన్ని చోట్ల జనాలకి ఆహరం అసలు అందట్లేదు. ఇది కచ్చితంగా అధికారుల మధ్య సమన్వయ లోపమే అని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి విజయవాడలో ప్రజలకి సహాయక చర్యలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!