వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకొబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్దం అవుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా వచ్చే డిసెంబర్‌లోనే ఏపీ ఎన్నికలు జరిగేలా జగన్ ప్రణళికలు రచిస్తున్నారు. పార్టీ నేతలు మాత్రం.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని చెబుతున్నప్పటికి కూడా.. జగన్ వ్యూహా రచన చూస్తుంటే మాత్రం.. ఆయన ఖచ్చింతగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ స్థితిగతులపై జగన్ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరును కూడా ఓ కంట కనిబెడుతునే ఉన్నారాయన.
ఎమ్మెల్యేలతో కాని, పార్టీ నాయకులతో కాని గత మూడేళ్లుగా పెద్దగా సమావేశం కాని… జగన్.. గతకొంతకాలంగా పార్టీ నేతలతో వరుసుగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల వారిగా సమావేశం అవుతూ కొంతమందికి టికెట్ ఖన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలోని పదవులను కీలక వ్యక్తులకు అప్పగించారు. ఇటీవలే జిల్లా అధ్యక్షులను కూడా మార్చేశారాయన. ప్రజల్లో ప్రభుత్వం – పార్టీ ఇమేజ్‌ను మరింత పెంచేలా కొత్త నిర్ణయాలు తీసుకొవడానికి జగన్ సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశ్ కావాలని నిర్ణయించారు. ప్రాంతీయ ,సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేయనున్నారని సమాచారం అందుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్ధిని ఫైనల్ చేస్తారని పార్టీ కీలక నేత ఒకరు చెప్పడం జరిగింది.
దీనిలో భాగంగానే ఈ నెల 8న పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు – జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాల వారీగా నియమితులైన పార్టీ ఇంఛార్జ్ లతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగన్ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ముందస్తు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పార్టీ నేతలతో చర్చించిన తరువాత ముందస్తు ఎన్నికలపై జగన్ నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో ముందస్తు ఎన్నికల్లో భాగంగా జగన్ కసరత్తు కూడా ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్దుల ఎంపిక పైన ఫోకస్ పెట్టారు. సర్వే సంస్థలను రంగంలోకి దించారు. ప్రతీ నియోజకవర్గంలో సమన్వయం చేసుకొనేలా ఈ సమావేశంలో నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో నేతల మద్య విభేదాల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని జగన్ డిసైడ్ అయ్యారు. పని చేసే వారికే టికెట్లు అని ..టికెట్లు ఇవ్వలేని వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్దుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు అనే అంశంపైన ఈ సమావేశంలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి జగన్ వ్యూహాలను ప్రతిపక్షాలు ఎలా తట్టుకుంటాయో చూడాల్సి ఉంది.