ఇదిరా జగన్ అంటే అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి అవార్డు
ఏపీ సీఎం జగన్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏపీలోనే కాకుండా మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా జగన్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో కూడా ఇప్పటికి జగన్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తం కూడా జగన్ బాగానే ఫేమస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రల్లో జగన్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన బెస్ట్ సీఎం ర్యాకింగ్స్‌లో కూడా ఏపీ సీఎం టాప్ ఫ్లేస్ కొట్టేయడాన్ని బట్టి చూస్తే మన సీఎం క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మూడోవ బెస్ట్ సీఎంగా జగన్ నిలిచారు. బీజేపీ ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి మరి ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే టాప్ 10లో కూడా చోటు దక్కించుకోకపోవడం విశేషం. తన పరిపాలనతో జగన్ అందరిని ఆకట్టుకుంటున్నారు. అటు సంక్షేమం ఇటు అభివృద్దిని రెండింటిని సమానంగా చేస్తు తన పాలన సాగిస్తున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయనని పథకాలను ఏపీలో అమలు చేసి చూపిస్తున్నారు. తాను ఏది అయితే ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పారో అది పాలనలో అమలు చేస్తున్నారు. అందుకే ఆయనకు ఏపీ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం జగన్‌దే అని ఓ సంస్థ చేసిన సర్వే తేలింది. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదేనని తేల్చిచెప్పింది. 48 శాతం ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ సర్కార్‌కు గుర్తింపు దక్కడం సంచలనంగా మారింది.
దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ స్థాయిలో జగన్ సర్కార్ అవార్డు దక్కించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా తాము రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కేటాగిరిలో అవార్డు రావడంతో జగన్ సర్కార్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థకి యునైటెడ్ నేషన్స్ ఫ్యూచర్ ఎకానమీ లీడర్షిప్ అవార్డు దక్కింది. ఈజిప్టులో నవంబర్ 5,6 తేదీల్లో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ 2022 కి ప్రతిష్టాత్మకమైన ‘ఫ్యూచర్ ఎకానమీ లీడర్షిప్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ మరియు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో రైతు సాధికర సంస్థ కు ప్రపంచ స్థాయిలో ఈ గుర్తింపు దక్కినట్లుగా తెలుస్తోంది.
ఐక్యరాజ్యసమితిలో రైతు సాధికారిక సంస్థ కార్యక్రమాలపైన ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే ఆర్బీకే కేంద్రాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్య – విద్య రంగాల్లో అమలు చేస్తున్న విధానాలకు కూడా చాలాసార్లు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రైతులకు సంబంధించి అవార్డు రావడం విశేషంగా మారింది. దీనిపై వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డుతో జగన్‌గారు రైతుల పక్షపాతిగా మరోసారి నిరుపితం అయింది. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.