వైసీపీ కీలక నేతలలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2014 ఎన్నికల తరువాత బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో బొత్స సత్యనారాయణ కూడా విజయం సాధించారు. ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత కావడంతో…బొత్స సత్యనారాయణకు మంత్రి పదవి చాలా ఈజీగానే వచ్చింది. మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో కూడా ఆయన తిరిగి తన మంత్రి పదవిని నిలబెట్టుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను ఖచ్చితంగా ఓడిస్తాని శపథం చేస్తున్నారు నాగార్జున. గత ఎన్నికల మాదిరిగా బొత్స సత్యనారాయణ విజయం సాధించే అవకాశం లేదని నాగార్జున అంటున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..బొత్స సత్యనారాయణ ఏపీ రాజకీయాలలో చాలా సీనియర్ నేత. వైఎస్ఆర్ ఇచ్చిన అండతో రాజకీయాలలో బొత్స సత్యనారాయణ ఎదిగారు.
వైఎస్ఆర్ సీఎం అయిన రెండు సందర్బాలలో కూడా బొత్స సత్యనారాయణకు మంత్రి పదవి దక్కిందంటే వైఎస్ఆర్ బొత్స సత్యనారాయణకు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన కుటుంబం మీద బొత్స సత్యనారాయణ చాలానే విమర్శలు చేశారు. కాని చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన తరువాత బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరడం జరిగింది. ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కూడా ఆయన రెండుసార్లు అక్కడ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను ఓడిస్తానని ప్రతిజ్క్ష చేస్తున్నారు కిమిడి నాగార్జున. 2019 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసి ఓడిపోయరాయన. కాని వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రం తనదే అని అంటున్నారాయన.
మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడిగా రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశం చేశారు నాగార్జున.2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో బొత్స సత్యనారాయణ గెలిచారని.. కాని ఇప్పుడు నియోజకవర్గంలో ఆ పరిస్థుతులు లేవని ఆయన వెల్లడించారు. కిమిడి నాగార్జున ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. కళా వెంకటరావు నాగార్జునకు పెదనాన్న అవుతారు. ఆయన అండ కూడా తనకు సాయపడుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. దాంతో టీడీపీ జెండా ఎగరేస్తామని తెలుగు తమ్ముళ్లు కూడా బాగానే ఉత్సాహపడుతున్నారు. మరి కిమిడి నాగార్జున వ్యూహాలను బొత్స సత్యనారాయణ ఎలా తట్టుకుంటారో చూడాలి.