YS Sharmila : ప్రకాశం బ్యారేజీని పరిశీలించి షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా ప్రజలు దుమ్ముత్తి పోస్తున్నారు. వరద బాధితులకు పరామర్శించిన ఆమె భరోసా ఇస్తారనుకుంటే రాజకీయరగడకు ప్రయత్నిస్తుందని మండి పడ్డారు. అసలు వరద బాధితుల పరామర్శను కూడా తన స్వార్ధానికి వాడుకునే ప్రయత్నం చేయడంపై పబ్లిక్ కట్టలు తెంచిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. షర్మిల బాధితులకు అడిగిన ముచ్చట్లలో ఏమాత్రం పనికొచ్చే మాటలు లేవన్నారు. కూటమి ప్రభుత్వంపై, బీజేపీపై సిల్లీ విమర్శలు చేస్తున్న షర్మిల బాధితులకు ఏం చేస్తారో చెప్పకుండా వరద ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువత్తుతున్నాయి. తెలంగాణలో తరిమితే ఏపీలో అడుగు పెట్టిన షర్మిల ప్రజల కోసం ఏం చేస్తుంది.. అంతా తన రాజకీయ భవిష్యత్తు కోసమే ప్రయత్నాలు చేస్తోందని పబ్లిక్ మండి పడుతున్నారు. బాధితులకు తన వంతు సాయం కాకుండా కేంద్రం, కూటమి ప్రభుత్వాలకు ప్రతి ఇంటికి లక్ష రుపాయిలు ఇవ్వాలని అడగడంలో అంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నా చంద్రబాబు సహాయక చర్యలు బాగా ఉన్నాయంటూ షర్మిల చెబుతోంది. గతంలో వైఎస్ బుడమనేరు డైవర్షన్ స్కీమ్ కు రూపకల్పన చేయడానికి ప్రయత్నించారన్నది అందరికీ తెలిసిందే. కానీ బాబు, పవన్ మాదిరిగానే అక్రమ నిర్మాణాల వల్లే వరదలకు కారణమంటూ చెప్పొకొచ్చారు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా ఇక్కడ కూడా హైడ్రా తెచ్చి ఆక్రమణలను కూల్చండంటూ చెప్తున్నారు. అసలు బాధ్యత ఎవరిది, షర్మిల వచ్చి, పరిస్థితిని పరిశీలించి చంద్రబాబుదే బాధ్యత అంటూ తప్పించుకోవడమేంటి…? అసలు షర్మిల ఎందుకొచ్చారంటూ తీవ్ర స్థాయిలో జనం ధ్వజమెత్తుతున్నారు. రాజకీయాలు చేసే సమయం కాదు.. అధికార పక్షాలైనా, ప్రతిపక్షాలైనా ఆదుకునే సమయం.. దయచేసి ఉన్న బ్రతుకును భయపెట్టకండంటూ షర్మిలను వేడుకుంటున్నారు. పర్యటనకు వచ్చిన షర్మిల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరిచిపోయేలా చేసేందుకు వచ్చినట్లుందని నెటిజన్ల సైతం ఫైర్ అవుతున్నారు. అసలు షర్మిల కూటమి ప్రభుత్వానికి మద్దతుగానే వచ్చినట్లుందని ప్రజలు అంటున్నారు. పరిస్థితికి కారణమైన కూటమి ప్రభుత్వంతో పాటు షర్మిల లాంటి లీడర్లు గత పాలనపైనే విరుచుకుపడుతుంటే… ప్రజల్లో మరింత భావోద్వేగం పెరిగిపోతుంది. జగన్ అధికారం ఉన్నా, లేకున్నా వస్తే చాలు దైర్యం కనబడుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్న కూటమి నేతలు, షర్మిల వచ్చి విమర్శలు, వారి సమర్ధనలే తప్ప చేసిందేమీ లేదని ప్రజలు స్పష్టం చేశారు. వదర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మా దౌర్భగ్యమని షర్మిలపై ప్రజలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.