Thursday, December 12, 2024

టీడీపీలో రాబిన్ శర్మ చిచ్చు…? సీనియర్ నేతల ఆశలు గల్లంతు..?

- Advertisement -

రాబిన్ శర్మ పేరు చెబితేనే టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మాపై ఆయన పెత్తనం ఏంటీ అని చాలామంది టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలో ఉన్న తమకు టికెట్ ఇవ్వాలో లేదో అని రాబిన్ శర్మ నిర్ణయిస్తారా అని టీడీపీ నేతలు ఆయనపై ఫైర్ అవుతున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాబిన్‌ శర్మ… ఈ పేరు ఇప్పుడు టీడీపీ పార్టీలో బాగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా రాబిన్‌ శర్మ అనే వ్యక్తి గురించి టీడీపీలో విపరీతమైన చర్చ సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా రాబిన్‌ శర్మను చంద్రబాబు నియమించుకున్నారు.

ఇటీవల పార్టీ విసృత స్థాయి సమావేశంలో రాబిన్‌ శర్మను చంద్రబాబు పార్టీ నాయకులకు పరిచయం చేశారు. వైసీపీని ఓడించేందుకు సిద్దం కావాలని పార్టీ నేతలకు రూట్ మ్యాప్ ఖరారు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో టీడీపీ పరిస్థితి , ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయించడానికి మొదలగు ప్లాన్‌లతో టీడీపీ నాయకుల ముందుకు రాబిన్ శర్మ వచ్చారు. నారా లోకేష్ పాదయాత్ర కూడా రాబిన్‌ శర్మ ఐడియా నుంచి వచ్చిందే అని అంటున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర ఎలా చేయాలనేది ప్రాక్టీస్ అవుతున్నారట. పాదయాత్రలో ఎలా మాట్లాడాలి…ఎలా ప్రజలకు దగ్గర కావాలి అనే దాని గురించి జగన్ పాదయాత్ర చేసిన వీడియోలు చూస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే టీడీపీ నాయకులపై కూడా రాబిన్ శర్మ సర్వేలు నిర్వహిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చంద్రబాబుకు రాబిన్ శర్మ సూచించారట. తాజాగా రాబిన్ శర్మ సర్వే ప్రారంభించడంతో పార్టీలోని సీనియర్ నాయకులకు కొత్త కష్టాలు ప్రారంభమైనట్లేనని భావిస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు, నారా లోకేష్‌లు స్పష్టం చేశారు. వారికి టికెట్లు ఇవ్వొద్దని పార్టీ రాబిన్ శర్మ కూడా టీడీపీ అధినేతకు స్పష్టం చేశారట. తామిచ్చిన సర్వే ప్రకారం పార్టీలో చర్యలు తీసుకోవడంతోపాటు కార్యకలాపాలుండాలని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ తన సర్వే ద్వారా అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తున్నారు. రాబిన్ శర్మ జాబితాలో సీనియర్ నేతల పేర్లు కొన్ని ఇందులో ఉండే అవకాశాలేవని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఎన్నికల వ్యూహకర్తగా నియమితులైన తర్వాత వారు చెప్పినదాని ప్రకారం చేయాల్సిందేనని, సీట్ల కేటాయింపు కూడా వారిచ్చే నివేదిక ఆధారంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నేతలు..రాబిన్ శర్మ తీరుపై మండిపడుతున్నారట. రాబిన్ శర్మ చెబితే టికెట్లు కేటాయించడం ఏంటని వారు చంద్రబాబును కూడా ప్రశ్నిస్తున్నారట. పార్టీ కోసం చాలా త్యాగాలు చేశామని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో గెలిచిన మాకు.. రాబిన్ శర్మ పాఠాలు చెప్పడం ఏంటని ఒకింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాడో పేడో తేల్చకోవడానికి వారు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తనికి రాబిన్ శర్మ వ్యవహరం టీడీపీలో కొత్త చిచ్చు రాజేస్తున్నట్లుగా కనిపిస్తుంది.మరి దీని చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!