Tuesday, January 14, 2025

Andrapradesh:నాడు ఎద్దేవా చేశారు.. నేడు వలంటీర్ విలువ తెలుసుకున్నారు

- Advertisement -

Andrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను ఇప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కనపెట్టింది. గతంలో రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు వలంటీర్లు నిత్యం వరద పరిస్థితిని అంచనా వేయడం, నది గట్లు ఎలా ఉన్నాయో పరిశీలించి వెంటనే అధికారులకు సమాచారం అందించే పనుల్లో నిమగ్నమై ఉండేవారు. అంతేకాకుండా బాధిత ప్రజలకు నిత్యావసరాలు అందించే క్రమంలో పీకల్లోతు నీళ్లు ఉన్నా సరే తాగునీరు, ఆహరం సమయానికి చేరవేసి అండగా నిలిచేవారు. అలాంటి వలంటీర్లను టీడీపీ అధికారంలోకి రాగానే పక్కనెపెట్టినా ప్రస్తుతం రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల విపత్తులో వలంటీర్ల విలువ తెలిసి వచ్చింది. ‘వలంటీర్లు ఏం చేస్తారు, సంచులు మోసే పనులే కదా..అంతకుమించి వారు చేసే పనులు ఏమిటి?’ అంటూ చంద్రబాబు ఒకప్పుడు వలంటీర్లను ఎద్దేవా చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. వరదల నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతుండటంతో అధికా­రులు వలంటీర్ల ద్వారానే బాధితులకు సాయ­మందించగలమని సీఎంకు చెప్పడంతో.. వెంటనే చంద్రబాబు ఆదే­శాలతో వలంటీర్లకు అధికారులు కబురు చేశారు.

దీంతో బుధవారం నుంచి సచివాల­యాల సిబ్బంది, వలంటీర్లు సహా­యక కార్యక్రమాల్లో పాల్గొని బాధిత ప్రజలకు అండగా నిలిచారు. 2020, 2022 ఏడాదిలో గోదావరి వరదల సమయంలో ముందస్తు సమాచారంతో, పక్కా ప్రణాళికతో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్లను అప్రమత్తం చేసి బాధితులను ఆదుకు­న్నారు. 20219–23 మధ్య వరదల సమ­యంలో ప్రతి అర కిలోమీటరు ఏటిగట్టు పర్యవేక్షణ బాధ్యతను వలంటీరుకు అప్పగించడంతో వారు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లోని చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి మరీ మో­కా­లి­పైగా నీరు ఉన్నా తమ ప్రాణాలను లెక్క చేయకుండా వలంటీర్లు సేవలు అందించారంటే అది వారికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటు అనే చెప్పాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!