సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తున్న ఆదిపురుష్ టీజర్
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బాహుబలి తరువాత తీసిన సాహో సినిమా అయితే మరో ప్రభాస్ క్రేజ్‌ను మరో ఎత్తుకు తీసుకువెళ్లిందనే చెప్పాలి. సాహో ప్లాప్ టాక్‌తో 300 కోట్ల కలెక్ట్ చేయడం విశేషంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సల్మాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ సినిమాలే ప్లాప్ టాక్ వస్తే… 100 కూడా రాని పరిస్థితి అలాంటిది.. సాహో సినిమా 300 కోట్లు కలెక్ట్ చేయడం సంచలనంగా మారింది. అది కూడా తెలుగులో కన్నా ఎక్కువుగా వసూలు చేయడం ప్రభాస్ స్టామినాకు నిదర్శంగా నిలిచిందనే చెప్పవచ్చు.
ఇక రాధేశ్యామ్ ప్రభావం ప్రభాస్ కొత్త సినిమా మీద పడినట్లుగా ఏమి కనిపించడం లేదు. ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా రామాయాణం కథంశంతో తెరకెక్కుతుంది. రాముడుగా ప్రభాస్ నటిస్తుండగా..సీతగా కృతి సనన్ నటిస్తుంది. రావణుడుగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఆదిపురుష్ టీజర్ మొత్తం కూడా ఆద్యాంతం ఆకట్టుకుందనే చెప్పాలి. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది.
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. గత సినిమాల టీజర్‌ల రికార్డులను ఆదిపురుష్ చేరిపివేసింది. ఇప్పటికే బాహుబలి సినిమా టీజర్ వ్యూస్‌ను క్రాస్ చేసింది ఈ సినిమా. గంటకు 3 మిలియన్ వ్యూస్‌తో ఎవరికి అందనంత ఎత్తులో ఆదిపురుష్ నిలిచిందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. విడుదలకు ముందే ఆదిపురుష్ ఇంతటి ఆరాచకం సృష్టిస్తుంటే.. విడుదల తరువాత ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నారు.