వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ సొంతంగా వైసీపీ స్థాపించినప్పుడు ఆయన వెంట నడించింది అతి కొద్దిమందే. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ వల్ల రాజకీయ లబ్దిపొందన వారు ఎవరు కూడా జగన్‌తో రాలేదు. జగన్‌తో ఎందుకులే అని కొందరు… అసలు ఈ పార్టీ మనుగడ సాగిస్తుందా అని మరికొందరు నేతలు .. జగన్ స్థాపించిన వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే జగన్ పెట్టిన పార్టీలో తొలుత చేరిందే టీడీపీ నేతలు. అవును మీరు వింటుంది నిజమే.. టీడీపీ నేతలే మొదట జగన్‌కు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఫ్యామిలీ మొదటి నుంచి కూడా టీడీపీలోనే కొనసాగేవారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవూరు నియోజకవర్గం నుంచి అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ విజయం సాధించారు.
అయితే జగన్‌ను జైలుకు పంపడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు.. కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి.. జగన్ స్థాపించిన వైసీపీ పార్టీలో చేరారు. అలా వైసీపీలో చేరిన తొలి ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్రలో నిలిచారు. 2012లో జగన్ కడప ఎంపీగా పోటీ చేయగా… విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వీరిద్దరు కాకుండా బయట నుంచి వైసీపీ తరుఫున తొలి ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం..నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డినే. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో..నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికు మంత్రి పదవి ఇస్తారని అందరు భావించారు. కాని అలాంటిది ఏమి లేదు. మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బెర్త్ ఖాయం అని అనుకున్నారు.
రెండోసారి కూడా ఆయనకు నిరాశే మిగిలింది. అయితే తాజాగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో వెనుకపడ్డారని తెలుస్తుంది. . తాజాగా జరిగిన వర్క్ షాప్‌లో కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి జగన్ హెచ్చరికలు జారీచేశారట. 25 శాతం కూడా పెర్ ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారని, ఏమాత్రం అలసత్వం పనికిరాదని హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాల్సినవారంతా కచ్చితంగా కష్టపడాల్సిందేనని, వారంలో నాలుగు రోజులు ప్రజల్లో ఉండాల్సిందేనని జగన్ ఖరాఖండి చెప్పారు. పనితీరు మార్చకోకపోతే టిక్కెట్ కష్టమనే సంకేతం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన వ్యక్తిగత పెర్ ఫార్మెన్స్‌ను పెంచుకుని రేసులో నిలబడతారో లేదో చూడాలి.