Friday, March 29, 2024

జగన్‌పై పరొక్షంగా కామెంట్ చేశారా..?

- Advertisement -

నటుడు మోహన్ బాబు ఎప్పుడు కూడా వార్తల్లో నిలవడానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు. అటు సినిమాపరంగా అయిన కానివ్వండి.. ఇటు రాజకీయపరంగా అయిన కానివ్వండి.. మోహన్ ఎప్పుడు కూడా తన ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటున్నారు. స్వతహాగా ఎన్టీఆర్‌ను దేవుడులా కొలుస్తుంటారాయన. అయితే మోహన్ బాబు కొడుకు విష్ణు.. వైఎస్ కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. వైఎస్ కుబుంబానికి చాలా దగ్గరైయ్యారు. దీనిలో భాగంగానే గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి …ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం కూడా నిర్వహించారు.

మంచు విష్ణు మా అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా విజయం సాధించడంలో జగన్ హస్తం కూడా ఉందని అప్పట్లో వార్తలు బాగానే వినిపించాయి. దీనిపై ఇరు వర్గాలు కూడా స్పందించింది లేదు. కొన్నాళ్లు అంత బాగానే ఉన్నప్పటికి.. జగన్ ప్రభుత్వం మోహన్ బాబును కాదని.. చిరంజీవికి పెద్ద పీట వేయడం అది మంచు కుటుంబానికి నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి మోహన్ బాబు వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని.. తన పూర్తి మద్దతు నరేంద్ర మోదీకేనని ప్రకటించారాయన.తాజాగా ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులపై విమర్శలు చేశారు. ఈ విమర్శలు జగన్‌ను ఉద్దేశించి చేసినట్టుగానే తెలుస్తోంంది.

హీరో విశాల్ తాజాగా నటించిన లాఠీ సినిమాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ బాబు.. పోలీస్ వ్యవస్థపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ లు, ఐపిఎస్ లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే పని చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు తిరుపతిలో నిర్వహించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కామెంట్ చేశారు. ఆయన అసలు ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై విపరీతమైన చర్చ సాగుతుంది. తెలంగాణ ప్రభుత్వంతో మోహన్ బాబుకు ఎటువంటి సమస్య లేదు. దీంతో ఆయన జగన్ సర్కార్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని చాలామంది భావిస్తున్నారు. మరి వైసీపీ నుంచి మోహన్ బాబు వ్యాఖ్యలను ఎవరు కౌంటరిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!