- పవన్ కళ్యాన్‌కి ముద్రగడ ఘాటు లేఖ
వారాహి యాత్ర ద్వారా నాలుగు రోజులుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అర్థం పర్థంలేని ఆరోపణలతో కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న పవన్ కళ్యాన్‌కి తన లేఖ ద్వారా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదురుగుతున్నారంటూ పరోక్షంగా తనపై చేసిన ఆరోపణలకు ఆయన గట్టిగానే బదులిచ్చారు. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితో ఉద్యమించానని, నేతలను విమర్శించడం మానేసి పవన్ అసలు విషయాలపై దృష్టిసారించాలని లేఖలో పవన్‌కు చురకలంటించారు ముద్రగడ.
‘నేను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు. నేను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా నేను ఉద్యమాలు చేయలేదు. చంద్రబాబు నాయుడి ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారు’ అని పరోక్షంగా పవన్ కళ్యాన్ చేస్తున్న పనులను తీవ్రంగా తప్పుబట్టారు.
ఎంత మందికి నారతీశారు? ఎంత మందికి గుండు గీయించారు? చెప్పడం కాదు కానీ, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవిస్తారా? కులం పేరు చెప్పుకుంటున్నారు కదా.. కాపులకు తమరు ఉద్ధరించిందేంటీ?
‘నా కంటే చాలా బలవంతుడైన పవన్.. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని పవన్‌కు చురకలంటించారాయన.
పార్టీ పెట్టిన తర్వాత పదిమంది చేత ప్రేమించబడాలిగానీ.. వీధి రౌడీభాషలో మాట్లాడడం ఎంతవరకూ న్యాయమంటారు?
కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి, తాతది తప్పుడు మార్గాల్లో సంపాదన అనే మాట చాలా తప్పు. ద్వారంరపూడిపై గెలిచి పవన్ తన సత్తా ఏమిటో చూపించాలి.
పవన్‌ను నిజంగా రాష్ట్రప్రజలపై ప్రేమ ఉంటే నా సలహాల ఆధారంగా యుద్ధం చేయండని, నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకో అంటూ పవన్‌కు హితోక్తి పలికారు…