ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే సామేతలా ఉంది టీడీపీ, జనసేన పరస్థితి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ చేతిలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా చావు దెబ్బతిన్నారు. జగన్ దెబ్బకు టీడీపీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం కాగా, పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారు. ఇక జగన్ సీఎం అయిన తరువాత ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విశేష స్పందన వస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా జగనే సీఎం అయ్యేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల్లో జగన్‌కు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ ఢీ కొట్టాలంటే కలిసి పోటీ చేస్తేనే లేకపోతే..మరొమారు జగన్ సీఎం అయితే టీడీపీ, జనసేన పార్టీలకు పుట్టగతులు ఉండవని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందుగానే గ్రహించారు. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో టీడీపీ , జనసేన కలిసి పోటీ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చేశాయి.
దీనిపై ఇప్పటికే ఇరువురు నేతలు పలుమార్లు భేటీ అయ్యారు. టీడీపీ , జనసేన పొత్తు ఖరారు అయినప్పటికి కూడా సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంటుంది. సాధారణంగానే అధికారం లేకపోతే చంద్రబాబు ఉండలేరు కాబట్టి.. ఆయనే సీఎంగా ఉంటారనే విషయం అందరికి తెలిసింది. ఒకవేళ టీడీపీ , జనసేన పార్టీలు గెలిస్తే.. చంద్రబాబు సీఎంగా ఏదో ఒక శాఖకు పవన్‌ను మంత్రిని చేస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి చంద్రబాబుకు ఇష్టం లేదని… ఏదో ఒక శాఖను కేటాయిస్తారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఈక్రమంలో జనసేన నాయకులు కొత్త వాదనను తెర మీదకు తీసుకుచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాపు నాయకుడే ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులు అంటున్నారు.
అంతేకాదు.. జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. ఖచ్చితంగా పవన్‌నే సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాలని జనసేన నేత హరిరామజోగయ్య డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే కాపులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాపులను రక్షించాలన్నా.. వారికి సంక్షేమం జరగాలన్నా .. పవన్ సీఎం కావాల్సి ఉందన్నారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే కాపులు . జనసేన-టీడీపీ పార్టీలకు అండగా ఉంటారని లేకపోతే.. అంతే సంగతులని ఆయన చెప్పుకొచ్చారు. కాపులు కూడా మానసికంగా పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తక్కువగా ఉందనే భవన వైపు అడుగులు వేస్తున్నారు. పొత్తు కుదరక ముందే ఇలాంటి డిమాండ్లు వస్తే..పొత్తు కుదిరిన తరువాత ఇంకెన్ని డిమాండ్లు తెర మీదకు వస్తాయో చూడాలి. పవన్ సీఎం అవుతారంటే కాపులు జనసేనకు అండగా నిలుస్తారేమో కాని.. మరొసారి చంద్రబాబును నమ్మి ఓట్లు వేయడానికి కాపులు సిద్దంగా లేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో పవన్‌ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారో లేదో చూడాలి