ఫాపం పవన్ కళ్యాన్.. జనసేన పార్టీ అధ్యక్షుడు.. రాజకీయరంగ ప్రవేశం చేసి దాదాపుగా 15 ఏళ్లవుతోంది. కానీ ఇప్పటికీ చట్ట సభల్లో అడుగుపెట్టలేకపోయాడు. సీఎం సీఎం.. అని ఫ్యాన్స్‌తో పిలిపించుకున్న పవన్.. ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పుకునే దౌర్భాగ్య దుస్థితికి దిగజారిపోయాడు. పిఠాపురం నియోజకవర్గం కత్తిపూడి సభలో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెడతానని ఫ్యాన్స్ కి చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. 2014లో పవన్ సపోర్టుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. పవన్ ని రాజ్యసభకి పంపుతుందని ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం ప్యాకేజీతో సరిపెట్టాడని ప్రచారం చేశారు తెలుగు తమ్ముళ్లు. అయితే పవన్ కి కేంద్రంలో ఉన్న మోడీషాల వద్దనున్న పలుకుబడి దృష్ట్యా బీజేపీ చేరదీస్తుందని, రాజ్యసభ నంచి ఎంపీని చేసి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తుందని జనసైనికులు ప్రచారం చేసుకున్నారు. కానీ అదీ జరగలేదు. ఈ రెండు పార్టీల మీద కోపంతో 2019లో ఒంటరిగా పోటీ చేసిన పవన్.. రెండు స్థానాల్లోనూ ఘోరంగా ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో 2024లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ జనసేన పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో మాత్రం సాక్షాత్తు పవన్ కళ్యాన్‌కి సైతం గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలియవచ్చింది. దీంతో తనను ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని వేడుకున్నట్టు చెబుతున్నారు. దీంతోపాటు కాపులు అధికంగా ఉండే పిఠాపురం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పిఠాపురం ప్రజలను వేడుకున్నాడు..