Sunday, September 8, 2024

చంద్రబాబు బుట్టలో 6గురు వైసీసీ ఎమ్మెల్యేలు ..? లిస్ట్ ఇదే

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్‌లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పడ్డారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. అవకాశం దొరికితే వారు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తారని తెలుస్తోంది. ఇంతకీ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేలు ఎవరో తెలియలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఏపీలో అప్పుడే ఎన్నికల వాతవరణం కనిపిస్తుంది. అధికార ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలని ప్రజలను లాస్ట్ ఛాన్స్ అని అడుగుతున్నారు. తాను మంచి చేస్తేనే వైసీపీకి ఓటు వేయండని సీఎం జగన్ ప్రజలను కోరుతున్నారు.

ఇదే సమయంలో తనకు ఓసారి ఛాన్స్ ఇవ్వండని ప్రజలను జనసేన అధినేత వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఓసారి పరిశీలిస్తే.. అధికార వైసీపీ పార్టీ కాస్తా ముందజలోనే ఉందని చెప్పాలి. వైసీపీ సర్కార్ మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా .. దానిని చాలా ఈజీగానే అధికమిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది కాని మీద కాదని.. ప్రజలు జగన్‌ను చూసే ఓటు వేస్తారని చాలామంది అభిప్రాయడుతున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది.

దాదాపు ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. వీరంత కూడా అవకాశం దొరికినప్పుడు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడానికి సిద్దం అవుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అయిదుమంది ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారని ఇంటిలిజెన్స్ రిపోర్టు ద్వారా తెలిసింది. అయితే వీరంత కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారే. వైసీపీలో టికెట్ రాదని ఫిక్స్ అయిన తరువాతే వీరు టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని సమాచారం. అయితే వైసీపీ నుంచి వెళ్లిన వారికి చంద్రబాబు ఎంతమందికి టికెట్లు ఇస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!