గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కూడా ఒకటి. అక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గొట్టిపాటి రవి కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో ఇదే గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణమాలతో ఆయన టీడీపీకి అమ్ముడుపోయి ఆ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా జగన్ ప్రభంజనం సృష్టించినప్పటికి కూడా అద్దంకిలో మళ్లీ గొట్టిపాటి రవి కుమార్ విజయం సాధించడాన్ని అక్కడున్న వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. పార్టీ క్యాడర్ ఉన్నప్పటికి కూడా వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయామే అని ఆవేదనలో వైసీపీ శ్రేణులు ఉండిపోయాయి.
ఇది గమనించిన పార్టీ అధినేత జగన్.. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత అద్దంకి బాధ్యతలను యువనేత బాచిన కృష్ణచైతన్యకు అప్పగించడం జరిగింది. తండ్రి వల్లే కాలేదు..ఈయన వల్ల అవుతుందా అని ఆయన ప్రత్యర్థులు ఎద్దెవా చేసిన సమయంలో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. బాచిన కృష్ణచైతన్య ప్రజల్లో మమేకం అయ్యారు. అక్కడితో ఆగకుండా సమస్య ఎక్కడుంటే అక్కడ బాచిన కృష్ణచైతన్య ప్రత్యక్షం అయి… వారి సమస్యను తీర్చడంతో ముందున్నారాయన. ప్రభుత్వం పథకాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో బాచిన కృష్ణచైతన్య ఎప్పుడు కూడా ముందున్నారు. పార్టీలకు అతీతంగా ఆయన స్పందిస్తున్న తీరు.. పరిణితి చెందిన తీరు చూస్తుంటే..ఆయనలో పరిణితి చెందిన ఓ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నారు.
అసలు అద్దంకిలో గొట్టిపాటి రవి కుమార్ ఎమ్మెల్యేనా…లేకపోతే బాచిన కృష్ణచైతన్యనా అనే అనుమానం కూడా నియోజకవర్గ ప్రజలకు అనుమానం కలుగుతుంది. ఇదే సమయంలో ఆయన తన రాజకీయ ప్రత్యర్థికి కూడా సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ ఇంఛార్జ్ లకు బాధ్యతలు అప్పగిస్తున్న సీఎం జగన్ ..తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి అభ్యర్ధిగా బాచిన కృష్ణచైతన్య పేరును ఖరారు చేశారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కృష్ణ చైతన్యకు మద్దతుగా నిలవాలని నిర్దేశించారు. ఎవరికైనా అభ్యంతరాలు..విభేదాలు ఉంటే తనను కలవాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీలో సమస్యలపైన సీఎం కీలక సూచనలు చేశారు. బాచిన కృష్ణచైతన్యకు టికెట్ ఖన్ఫార్మ్ చేయడంతో.. ఆయన వర్గం సంబంరాలు సంబంరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో గొట్టిపాటి రవి కుమార్‌కు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇన్నాళ్లకు గొట్టిపాటి రవి కుమార్‌కు అద్దంకిలో సరైన మొగుడు వచ్చారంటూ నియోజకవర్గ ప్రజలు వ్యాఖ్యనిస్తున్నారు.