2024 ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం అయినప్పటికి కూడా ముఖ్యంగా మాత్రం ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి చాలా ముఖ్యమని చెప్పాలి. ఆ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే కనుక 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిందే. అది పొత్తు పెట్టుకుని వచ్చామా.. లేదా.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చామా అన్నది తరువాత సంగతి. టీడీపీ బ్రతికి ఉండాలంటే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఇప్పటికే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. మరొసారి ఓడిపోతే.. ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ టీడీపీ మూలాలపై దెబ్బకొట్టారు.
ఈసారి ఏకంగా టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టేందుకు ఆయన సిద్దం అవుతున్నారు. జగన్ వ్యూహాలను తట్టుకోలేని చంద్రబాబు.. జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒంటరిగా వెళ్తే… జగన్‌ను ఎదుర్కొనలేకనే చంద్రబాబు పవన్‌తో కలిసి పోటీ చేయడానికి సమయత్తం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చివరిసారిగా సీఎం కావాలని కలలు కంటున్న చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చాలామంది టీడీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్దం అవుతున్నారు.
టీడీపీకి భవిష్యత్తు కష్టమేనన్న భావనలో ఉన్న ఆ ముఖ్య నేతలు, జనసేన వైపుగా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో ఓ యువ ఎంపీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జనసేనానితో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్ళారనీ, త్వరలోనే వాళ్ళంతా జనసేనలోకి దూకేస్తారనీ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక జనసేన పరిస్థితి గురించి చెప్పడానికి కొత్తగా ఏం లేకపోయినప్పటికి కూడా గతంలో వచ్చిన ఒక సీటు కన్నా ఎక్కువ తెచ్చుకుంటే గొప్పగా ఫీల్ అవ్వడానికి ఆ పార్టీ నేతలు సిద్దం అవుతున్నారు. మొత్తనికి పొత్తు పెట్టుకున్న కూడా టీడీపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.