వరుసగా మూడు శుభవార్తలు చెప్పిన జగన్..వారికి పండుగే
ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రానున్నది ఎన్నికల సమయం కావడంతో.. జగన్ చాలా పగడ్బిందిగా ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయడానికి ఆయన ఎంతటి నిర్ణయానైనా తీసుకోవడానికి సిద్దం అవుతున్నారు. ఈక్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరేలా మూడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. అందులో మొదటగా..దివ్యాంగులకు సంబంధించింది. దివ్యాంగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. సివిల్స్, జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ చేసేలా ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో త్వరలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, బ్యాంకింగ్, డీఎస్సీ, ఆర్ఆర్ బీ వంటి పోటీ పరీక్షలకు ట్రైనింగ్ ఇస్తూ, భోజన, హాస్టల్ వసతి ఉచితంగా అందిస్తామని జగన్ పేర్కొన్నారు.
ఇది పేద , మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో తోడ్పాడుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. దీని తరువాత విద్యాశాఖపై జగన్ ఫోకస్ పెట్టారు. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సీఎం జగన్ సూచించారు. జిల్లాల్లో ఉన్న పరిశ్రమల మేరకు కోర్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు సీఎం జగన్. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విదేశాల్లో కోర్సులు పరిశీలించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు సీఎం జగన్. ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో బోధన, వసతుల అంశంపైనా చర్చించారు. బోధన సిబ్బంది, వసతి సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీల్లో సిబ్బంది భర్తీ, సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.
ఇక ఇదే సమయంలో రేషన్ కార్డు దారులకు కూడా జగన్ శుభవార్త చెప్పారు. ఇప్పటి నుంచి పూర్తి ఉచితంగా అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇంతవరకు కిలోకి రూపాయి తీసుకునే వారు ఇకనుంచి పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తున్న సర్కారు నూతన సంవత్సరం నుంచి జిల్లాలో ఉచిత రేషన్ అమలుచేయనుంది. ఇక నుంచి నూతన సంవత్సరంలో సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు శుభవార్తల ద్వారా అటు విద్యార్థులకు మంచి నైపుణ్యం ఎఉన్న విద్యాతో పాటు,ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రభుత్వమే ఉచిత శిక్షణ ఇస్తుంది. ఇక ఫ్రీ రేషన్ ద్వారా మధ్యతరగతి ప్రజల మీద భారం పడకుండా ఉంటుందని ఆర్థికవేత్తలు సైతం చెబుతున్నారు. మరి ఈ మూడు నిర్ణయాలు జగన్ సర్కార్‌కు ఎలాంటి మేలు చేకూరుతుందో చూడాలి.