ఉన్న కష్టాలు చాలవు అన్నట్లుగా .. మంత్రి రోజాకు కొత్త కష్టాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచి మంత్రైనా రోజాకు వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆమె చాలానే కష్టపడాల్సి ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. రోజా ఓడించాలని.. ప్రత్యర్థులు ఎంతలా ప్రయత్నిస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ మందే.. సొంత పార్టీ నేతలు ఆమె ఓడిపోవాలని కోరుకుంటున్నారు. దీని వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. ఇవ్వన్ని చాలవు అన్నట్లుగా..రోజాకు కొత్త సమస్య వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించడానికి జనసేన తరుఫున జబర్థస్త్‌కు సంబంధించిన వ్యక్తి రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుంది. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు మెగా బ్రదర్ నాగబాబు. అవును మీరు వింటుంది నిజమే.. వచ్చే ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు నగరి నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వైసీపీ కీలక నేతల్లో మంత్రి రోజా కూడా ఒకరు. ఫైర్‌బ్రాండ్‌గా పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. తమకు రాజకీయ ప్రత్యర్థులైనా..చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను విమర్శించడంలో రోజా రూటే సపరేటు. మీడియా ముందుకు వచ్చారంటే .. వీరిద్దరిని ఏకిపారేస్తుంటారామె. అందుకే ఆమెపై ప్రత్యర్థి పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగానే రోజాపై మెగా బ్రదర్ నాగబాబును రంగంలోకి దించుతున్నారట పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి లోకసభకు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు నాగబాబు. ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని యోచిస్తున్నారట. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా ఆయనకు సరైన స్థానం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో నగరి అయితేనే నాగబాబుకు అన్ని విధాలా సరిపోతుందని భావిస్తున్నారు. ఈమేరకు మెగా బ్రదర్ కూడా రోజాపై పోటీకి అంగీకరించినట్లు తెలిసింది. గతంలో రోజా, నాగబాబు ఇద్దరు కూడా జబర్థస్త్ షోకు జడ్జీలుగా వ్యవహరించారు. అలాంటి వీరిద్దరు రాజకీయంగా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కనుక అది హాట్ టాపిక్ అవుతుంది. ఒకవేళ ఇది జరిగితే కనుక వీరిద్దరు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.