Monday, February 10, 2025

రూటు మార్చిన జగన్.. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరు?

- Advertisement -

వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా? మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారా? దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తున్నారా? అందుకే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారా? బడ్జెట్ సమావేశాలకు హాజరై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడనున్నారా? అటు నుంచి అటే జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి? ఏం మాట్లాడాలి? ప్రభుత్వం నుంచి రివర్స్ ఎదురైతే ఏం చేయాలి? అటు నుంచి అటే ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ సెషన్స్ కు హాజరు కావాల్సిందేనని తీర్మానించుకున్నట్లు సమాచారం.

వైసిపి అధికారం కోల్పోయి ఏడు నెలలు అవుతుంది. మరోవైపు పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. సన్నిహిత నేతలు సైతం పార్టీలో ఉండలేని పరిస్థితి ఎదురయింది. మునుపటి జగన్ లా పోరాడితేనే వైసిపి నిలబడుతుంది. అది గుర్తించి జగన్ ఇప్పుడు పోరాటానికి దిగుతున్నారు. అధికారం వేరు. అపోజిషన్ రోల్ వేరు. అధికారంలో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అధికారులు అంతా చూసుకుంటారు. కానీ అపోజిషన్ లోకి వచ్చేసరికి మాత్రం సీన్ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్ అయిపోతారు. అటువంటి అధినేత లీడ్ రోల్ తీసుకోవాలి. ముందుండి పోరాడాలి. లీడర్లతో పాటు క్యాడర్లో ధైర్యం నింపాలి. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండ కట్టేందుకు పార్టీ శ్రేణులు ముందుకు వస్తాయి. అయితే ఇప్పటివరకు అలాంటి వ్యూహం రచించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఇప్పుడు జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని భావించిన జగన్.. ఇప్పుడు రూటు మార్చినట్లు చెబుతున్నారు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతోంది. ఇప్పటికే మూడు విడతల అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. తొలి సమావేశంలో సభ్యులంతా ప్రమాణం చేశారు. జగన్ తో పాటు వైసిపి సంవత్సర ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తరువాత పది రోజులపాటు కొనసాగిన సమావేశాలకు మాత్రం జగన్ హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతోనే తాను సమావేశాలకు రాలేనని జగన్ తేల్చి చెప్పారు.

అయితే అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాని జగన్ ప్రెస్ మీట్ లు పెట్టి ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వ్యూహం మారింది అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ నుండి ప్రభుత్వం. మరోవైపు విజయసాయిరెడ్డి లాంటి కీలక నేత పార్టీని వీడిన నేపథ్యంలో.. బడ్జెట్ సెషన్కు హాజరుకావడమే మేలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసిపి అసెంబ్లీకి డుమ్మా కొట్టడం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం.. రాజీనామాలు చేయవచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే అసెంబ్లీ కి వెళ్లకుండా ఉండిపోవడంతో వైసీపీకి మైనస్ అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్షానికి ప్రధాన పోరాట క్షేత్రమే అసెంబ్లీ అన్నట్టు ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే వైసిపి ప్రభుత్వం మీద పోరు ప్రకటించి.. బంపర్ విక్టరీ కొట్టారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు కూడా జగన్ అదే పని చేయాలని పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటుంది.

అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ లకే పరిమితమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెద్దగా ప్రయోజనం ఉండడం లేదన్న భావనలో వైసీపీ ఉంది. ఇప్పటికే శాసనమండలికి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా తనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో బడ్జెట్ సెషన్స్కు హాజరవ్వడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. వైసిపి ఓడిపోయిన తర్వాత తొలి బడ్జెట్ సెషన్ ఇదే. అందుకే జగన్ భారీ వ్యూహంతో అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ప్రణాళికల రూపొందిస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!