రాబోవు ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకున్నాయి. అయితే అన్ని సర్వేలు కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపడంతో..ప్రతిపక్షాలు ఒత్తిడిలోకి వెళ్లాయి. తాజాగా టీడీపీ చేసిన అంతర్గత సర్వేలో కూడా ఆ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయాట. 2024 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 30 నుంచి 40 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తేలడంతో.. వెంటనే టీడీపీ మూల స్థంబాలైన ఎల్లో మీడియా అధిపతులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించి వెంటనే దిద్దుబాటు చర్యలు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. టీడీపీ ఒంటరిగా వెళ్తే ఘోర ఓటమి తప్పదని తెలిసిన చంద్రబాబు వెంటనే … జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఎలాగైనా సమావేశం కావాలని చూశారట. విశాఖలో జరిగిన ఘటనను అడ్డంగా పెట్టుకుని పవన్ , చంద్రబాబు ఇద్దరు కూడా విజయవాడలో సమావేశం అయ్యారు.
ఈ భేటీలో భవిష్యత్తు రాజకీయల గురించి కూడా చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జనసేనకు 30 నుంచి 40 అసెంబ్లీ సీట్లు ఇస్తామని పవన్ ముందు ప్రతిపాదించారట చంద్రబాబు. అయితే పవన్ మాత్రం తమకు 70 40 అసెంబ్లీ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దీనిపై ఎన్నికల ముందు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మాజీ జనసేన నాయకుడు రాజు రవితేజ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికరమైన అంశాలను ప్రజలతో పంచుకున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి కూడా రాజు రవితేజ పవన్‌తో నడిచారు. కాని 2019 ఎన్నికల ముందు జనసేన నుంచి బయటకు వచ్చారు.
పవన్ సిద్దాంతాలు నచ్చకనే తాను జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చానని రాజు రవితేజ చెప్పుకొచ్చారు. అభిమానులు పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని.. కాని పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలని చూస్తున్నారని రాజు రవితేజ తెలిపారు. కాని కార్యకర్తలు మాత్రం మరోసారి వేరే వారి పల్లకి మోయడానికి సిద్దంగా లేరని .. టీడీపీకి ఓటు వేసి చంద్రబాబును సీఎంగా చేయడాన్ని వారు చూడలేరని రాజు రవితేజ వ్యాఖ్యనించారు. రాజకీయాల్లో ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్లాలని చూస్తారని.. కాని పవన్ కల్యాణ్‌ది ఒకటే ఏజెండా అని.. జగన్ సీఎం కాకుండా చూడాలనే ఆయన ముఖ్య ఉద్దేశమని రాజు రవితేజ చెప్పుకొచ్చారు. పవన్ చంద్రబాబు కలిసిపోతారని..తాను ఎప్పుడో భావించానని.. వారు వీడిగా పోటీ చేసిన మరోసారి జగన్‌కు తిరుగు లేదని ఆయన తన అభిప్రాయంగా వెల్లడించారు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయాలకే పనికి రాడని.. ఆయన ఎందుకు రాజకీయాలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని రాజు రవితేజ వ్యాఖ్యనించారు.