Monday, February 10, 2025

నోటి దూల తగ్గించుకొని నాగబాబు.. ఇలా అయితే కష్టమే!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు ప్రవర్తన వింతగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి చెడ్డ పేరు రావడానికి నాగబాబు ఒక కారణమన్న విమర్శ ఉంది. ఆయనకు సోదరుడు చిరంజీవి పై అభిమానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఉంటుంది. అది ఆయన ఇష్టం కానీ.. వారిద్దరిపై చిన్నపాటి విమర్శలు వచ్చిన తట్టుకోలేరు నాగబాబు. అవసరం అయితే వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనుకడుగు వేరు. కేవలం మెగాస్టార్ సోదరుడు అనే గౌరవం ఆయనకు ఉంది. అంతే తప్ప ఆయన సైతం ఒక సామాన్య నటుడు. ఆ విషయాన్ని గ్రహించక చాలా పెద్ద మాటలు ఆడుతుంటారు. ఇప్పుడు తన సోదరుడు పవన్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కావడంతో.. అదేదో శాశ్వతంగా భావిస్తున్నారు నాగబాబు. అందుకే ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. తాజాగా ఆయన రెడ్డి సామాజిక వర్గం గురించి అనుచిత కామెంట్స్ చేశారు. తనకు ఏ రెడ్డి అన్న భయం లేదని.. పిచ్చి రెడ్డి అంటూ నోరు పారేసుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తాను ఒక తోపులా భావిస్తారు. పద్ధతి తప్పి మాట్లాడుతుంటారు. గతంలో ఇదే నాగబాబు ఇదే నందమూరి బాలకృష్ణ ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు. తనకు బాలయ్య అంటే తెలీదు అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఆయన ఒక నటుడే కాదు అన్నట్టు భావన వచ్చేలా మాట్లాడారు. అంతా నా ఇష్టం అన్నట్టు వ్యవహరించేవారు. అయితే నాగబాబు పట్ల ఇప్పుడు ఉన్న గౌరవం, ప్రతిష్ట అంతా చిరంజీవి చలువే.

ఇది ప్రజాస్వామ్యం. ఎవరు ఎలాగైనా మాట్లాడవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి మనోభావాలను దెబ్బతీయడం అనేది చాలా తప్పు. ఈ విషయంలో చాలాసార్లు తప్పు చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఆయన ఆవేశపూరిత మాటలు, పదప్రయోగం సైతం కాస్త కటువుగా ఉంటుంది. ప్రజల్లో ఉండేటప్పుడు ఏం మాట్లాడాలి? ఇతర వ్యక్తులకు ఎలా సంబోధించాలి? అన్నది మరిచి ప్రవర్తిస్తుంటారు నాగబాబు. పైగా సెటైరికల్ గా మాట్లాడే క్రమంలో ఎదుటి వ్యక్తి మనోభావాలను దెబ్బతీస్తుంటారు. మెగా కుటుంబం అనే హవా చూపిస్తుంటారు. బహుశా చిరంజీవి చుట్టూ ఇంతటి వివాదాలు రావడానికి మాత్రం ముమ్మాటికి నాగబాబు కారణమని తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.

రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సహజం. అవి నాగబాబుకు తెలియనివి కావు. ఈ రాష్ట్రం గొప్పగా భావించే మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 స్థానాలకి పరిమితం అయ్యారు. రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట గెలిచారు. అంతెందుకు 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది జనసేన. కానీ ఆ పార్టీకి దక్కింది కేవలం ఒక్క సీటు మాత్రమే. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోయారు. ఇక నాగబాబు గురించి చెప్పనవసరం లేదు. నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అందుకే ఓటమి చెందిన వారంతా అసమర్ధులు కాదు. గెలిచిన వారంతా సమర్థులు కాదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

నో డౌట్.. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి మంచి పేరు ఉంది. మెగాస్టార్ సౌమ్యుడు అన్న వారే అధికం. కానీ అన్నయ్య పై ఉన్న అభిమానంతో నాగబాబు చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ వరకు ఓకే. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల మధ్య ఉంటున్నారు. అందుకే ప్రజలను ప్రాంతాలు, కులాలుగా విభజిస్తే సమాజానికి చేటు. నాగబాబు నోటి నుంచి పిచ్చి రెడ్లు, పిచ్చి పంతులు అనే మాటలు వినిపిస్తే ఆయనకే నష్టం. అంతకుమించి సోదరుడు పవన్ కళ్యాణ్ కు నష్టం. మరి ముదిరితే కూటమికి కష్టం. అందుకే నాగబాబు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే కూటమికి అంత ప్రయోజనం అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!