Monday, February 10, 2025

బిజెపికి షాక్ ఇచ్చిన నితీష్.. ఎన్డీఏకు జెడియు గుడ్ బై!

- Advertisement -

ఎన్డీఏ కు నితీష్ షాక్ ఇవ్వనున్నారా? బిజెపితో తెగతెంపులు చేసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీఏ 3 లో నితీష్ నేతృత్వంలోని జనతాదల్ యునైటెడ్ పార్టీ కీలక భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు నితీష్ సపోర్ట్ తోనే మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించారు. అయితే అది కేంద్రంలోనూ కాదు. బీహార్ లోను కాదు. మణిపూర్ రాష్ట్రంలో బిజెపి కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు నితీష్ ప్రకటించారు. మణిపూర్ లో జేడీయుకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటివరకు జెడియు ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు నితీష్ కుమార్. తద్వారా ఎన్డీఏ కు గట్టి సంకేతాలు పంపారు. బీహార్ ఎన్నికలకు ముందు గట్టి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు.

వాస్తవానికి మణిపూర్లో బిజెపికి జేడీయు మద్దతు విత్ డ్రా చేసుకోవడం వల్ల ఏర్పడే ప్రమాదం లేదు. ఇక్కడ బిజెపి ప్రభుత్వం కూడా కూలిపోదు. అయితే నితీష్ కుమార్ మద్దతు వల్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బతుకుతున్నది.. నిలబడింది. కేంద్రంలో ఇంతలా మద్దతు ఇచ్చిన జీడియు.. ఇప్పుడు మణిపూర్ లో అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో జెడియు ప్రగతింపులకు సిద్ధమవుతోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. జస్ట్ హెచ్చరికగానే ఇలా చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

2022లో మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా జేడీయు నుంచి ఆరుగురు గెలిచారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జెడియుకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బిజెపిలోకి వెళ్లారు. ప్రస్తుతం జేడీయుకు మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తన మద్దతును ఉపసంహరించుకున్నారు. అయితే దీనిపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలో బీహార్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బిజెపి పై పట్టు బిగించేందుకు జెడియు ప్రయత్నిస్తోందన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో బీహార్లో బిజెపికి ఛాన్స్ ఇవ్వకూడదని నితీష్ కొత్త నాటకం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఎన్డీఏ 3 అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడ్ యు. ఏపీలోని తెలుగుదేశం పార్టీ సైతం తన వంతు దోహద పడింది. అయితే చంద్రబాబుకు ఇస్తున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదని నితీష్ భావిస్తున్నారు. మరోవైపు బిజెపి వ్యవహరిస్తున్న తీరు కూడా నితీష్ కు మింగుడు పడడం లేదు. మళ్లీ ఆయన ఆర్జెడితో జతకట్టేందుకు సిద్ధపడుతున్నారని.. కాంగ్రెస్, ఆర్జెడితో కలిసి ముందుకెళ్తారని.. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మణిపూర్ లో మద్దతు ఉపసంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!