Thursday, December 12, 2024

సోషల్ మీడియా వేదికగా బట్టబయలైన టీడీపీ నీచ రాజ‌కీయాలు

- Advertisement -

తాను దేశంలోనే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిని అని, 45 ఏళ్ళుగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, సెల్‌ఫోన్ల‌ను భార‌త‌దేశానికి తీసుకొచ్చాన‌ని, స‌ముద్రాన్ని సైతం కంట్రోల్ చేయ‌గ‌ల‌న‌ని గ‌ప్పాలు కొడుతుంటాడు చంద్ర‌బాబు. కానీ వాస్త‌వాలు గ‌మ‌నిస్తే ఆయ‌న రాజ‌కీయ చరిత్రంతా వెన్నుపోట్లు, కుట్ర‌లు, న‌మ్మ‌క‌ద్రోహాలు, దిగ‌జారుడుత‌నాల‌తోనే నిండి ఉంటుంది. 2019లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన త‌ర్వాత ఆయ‌న నీచ రాజ‌కీయాలు ప్రారంభించారు. ఇక ఇప్పుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేమ‌ని తెలియ‌డంతో ఆయ‌న నీచ రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరాయి.

గ‌త కొన్నాళ్ళుగా స్వాతిరెడ్డి పేరుతో ఓ మ‌హిళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారిపై, ఏపీ ప్ర‌భుత్వంపై ట్విట్ట‌ర్‌లో అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తోంది. ఈమెకు వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు దీటుగా బదులివ్వ‌డంతో త‌న దుష్ప్ర‌చారాన్ని మ‌రింత పెంచింది. తాను యూకేలో ఉంటాన‌ని, ఏపీ ప్ర‌భుత్వం కానీ, పోలీసులు కానీ త‌న‌ను ఏమీ చేయ‌లేర‌ని చెబుతూ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టింది. అయితే ఇటీవ‌లి కాలంలో వైయ‌స్సార్సీపీ సోష‌ల్ మీడియా బ‌లం పుంజుకోవ‌డంతో పాటు పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు యాక్టివ్‌గా ఉంటూ దుష్ప్ర‌చారం చేస్తున్న వారికి దీటుగా బదులిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైయ‌స్సార్సీపీ సోష‌ల్ మీడియాను ఎదుర్కోలేమ‌ని టీడీపీ సోష‌ల్ మీడియాకు అర్థ‌మైంది. దీంతో చంద్ర‌బాబు త‌న‌దైన నీచ రాజ‌కీయాల‌కు తెర‌తీశాడు. ఇందులో భాగంగా స్వాతిరెడ్డితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబ స‌భ్యుల మీద‌, మ‌హిళా మంత్రుల మీద అస‌భ్య‌క‌ర‌మైన పోస్టులు చేయించాడు.

అయితే స్వాతిరెడ్డి విష‌ప్ర‌చారం వెనుక‌ చంద్ర‌బాబు ప్ర‌మేయం ఉంద‌ని ఎవ‌రూ భావించ‌లేదు. ఆమె టీడీపీ మీద అభిమానంతోనే ఇలాంటి పోస్టులు పెడుతోందని అనుకున్నారు. కానీ నాలుగు రోజుల క్రితం స్వాతిరెడ్డి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబ స‌భ్యులపై అత్యంత అస‌భ్య‌క‌రంగా ట్విట్ట‌ర్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేసింది. దీంతో వైయ‌స్సార్సీపీ సోష‌ల్ మీడియా ఆమెకు గ‌ట్టిగా స‌మాధానం చెప్ప‌డంతో ఒక మ‌హిళ‌న‌ని చూడ‌కుండా త‌న‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నారంటూ విక్టిమ్ కార్డ్ బ‌య‌ట‌కు తీసింది. ఇన్నాళ్ళూ సాటి మ‌హిళ‌ల‌పై అస‌భ్యంగా పోస్టులు పెట్టిన స్వాతిరెడ్డికి త‌న దాకా వ‌చ్చేస‌రికి ఆ బాధ ఎలా ఉంటుందో అర్థ‌మైంది. అయితే ఆమెకేదో తీర‌ని అన్యాయం జ‌రిగిపోయిన‌ట్టుగా రెండు రోజుల నుంచి టీడీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో ఆమెకు అండ‌గా నిలుస్తున్నామ‌ని పోస్టులు పెడుతున్నారు. ఇక ఈరోజు చంద్ర‌బాబు కూడా స్వాతిరెడ్డికి తాను అండ‌గా నిలుస్తున్నాన‌ని చెప్ప‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇన్నాళ్ళూ ఆయ‌న ఆదేశాల‌తోనే స్వాతిరెడ్డి ఇలాంటి అస‌భ్య‌క‌ర‌మైన పోస్టులు పెడుతోంద‌ని నెటిజ‌న్ల‌కు అర్థ‌మైంది. దీంతో చంద్ర‌బాబు, స్వాతిరెడ్డిల తీరును వారు ఎండ‌గ‌డుతున్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునే స‌త్తా లేక చివ‌రికి చంద్ర‌బాబు ఇలాంటి నీచానికి దిగ‌జారాడ‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఇక‌నైనా ఈ నీచ ప్ర‌చారానికి టీడీపీ అడ్డుక‌ట్ట వేస్తుందో లేక ఎలాగూ బండారం బ‌య‌ట‌ప‌డింది కాబ‌ట్టి తెగించిన వాడికి తెడ్డే లింగం అన్న‌ట్టు మ‌రింత దిగ‌జారి పోతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!