Sunday, May 5, 2024

చంద్రబాబు సమక్షంలోనే రోడ్డున పడికొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

- Advertisement -

టీడీపీలో బయటపడ్డ విభేదాలు రోడ్డున పడికొట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు

వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి తాను సీఎం కావాలని పగటి కలలు కంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే.. టీడీపీ ఉండదు, చంద్రబాబు ఉండరు అనే మాటలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. అందుకే ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన భావిస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీని గాడిలో పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ప్రయత్నాలు అన్ని కూడా వృధా ప్రయాసే అవుతుంది. చంద్రబాబు మాటలను పార్టీలో ఏ రాజకీయ నాయకుడు కూడా లెక్క చేయడం లేదు. తాజాగా టీడీపీలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

ప్రత్యర్థిని ఓడించాలని చంద్రబాబు చెబుతుంటే.. తమలో తమకు సఖ్యత లేక.. టీడీపీ నాయకులే రోడ్డున పడికొట్టుకుంటున్నారు. అది కూడా పార్టీ అధినేత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే కావడం గమనర్హం. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏ రాజకీయ అధినేత అయిన ఓ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు.. అక్కడ విభేదాలను బయటపెట్టి అందరు కలిసి పని చేస్తారు. కాని టీడీపీ నాయకులు మాత్రం దీనికి పూర్తి విరుద్దంగా ఉన్నారు. చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్న సమయంలోనే టీడీపీ నాయకులు రోడ్డున పడికొట్టుకుంటున్నారు.

ఈ ఘటన కృష్ణాజిల్లా జగయ్యపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది. రేపు జగయ్యపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రఘురాం వర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వర్గం బాహాబాహీకి దిగింది. ఇరు వర్గాలు రోడ్డున పడి కొట్టేసుకున్నాయి. కర్రలు రాళ్లతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరుపై మరోకరు కేసులు కూడా పెట్టుకుని పార్టీ పరువును రోడ్డున పడేలా చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇలా వర్గ విభేదాలు బయటపడటం సంచలనంగా మారింది. ఈ ఘటన పార్టీ ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తుందని పార్టీ క్యాడర్ వాపోతుంది. గ్రూపుల తగదాల మధ్య చంద్రబాబు కార్యక్రమం ఎలా ఉంటుందో అని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!