ఏపీలో వైసీపీపై కుట్ర జరుగుతోంది. ఇటీవల పరిణామాలు దాన్ని తెలియజేస్తున్నాయి. బిజెపి ఏపీలో కూటమి భాగస్వామి. ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన ఎన్డీఏలో కీలక భాగస్వాములు. ఆ మూడు పార్టీల మధ్య మైత్రి కుదరడంతో పరస్పరం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తాయి. ఒకరి ప్రయోజనాలు ఒకరు హరించకుండా.. తప్పకుండా ప్రత్యర్థి పై పడతాయి. ఆ మూడు పార్టీల ఉమ్మడి ప్రత్యర్థి ఇప్పుడు వైసీపీ. అందుకే ఆ మూడు పార్టీలు తప్పకుండా టార్గెట్ చేసుకుంటాయి. కేంద్రంలో అధికారంలో ఉంది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ. రాష్ట్రంలో అధికారంలో ఉంది టిడిపి నేతృత్వంలోని కూటమి. ఇలా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉమ్మడి శత్రువు గా ఉంది వైసీపీ. కచ్చితంగా ఆ మూడు రాజకీయ పార్టీలు జగన్ పార్టీతో ఒక ఆట ఆడుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. వైసీపీని నిర్వీర్యం చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను ఆ మూడు పార్టీలు పంచుకోవడం కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి నాలుగు స్థానాలకే పరిమితం అయింది. అయితే రాజ్యసభలో ఉండే 11 మంది ఎంపీలతో పాటు.. రాష్ట్రస్థాయిలో శాసనమండలిలో ఉన్న 38 ఎమ్మెల్సీ సీట్లతో రాజకీయం చేయాలని జగన్ భావించారు. కానీ పవర్ పాలిటిక్స్ ముందు జగన్ ఆలోచనలు తేలిపోయాయి. అందుకే ఇప్పుడు కూటమిని అడ్డం పెట్టుకొని బిజెపి నయా రాజకీయాన్ని తెరతీసింది. వైసిపికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అసలు వైసీపీ లేకుండా సరికొత్త రాజకీయ క్రీడ ఆడుతోంది బిజెపి. అటు తెలుగుదేశం పార్టీతో పాటు టిడిపికి కావాల్సింది అదే.
మొన్నటి వరకు వైసిపి విషయంలో బిజెపి ఉదారంగా వ్యవహరించింది. ఎందుకంటే అప్పటి శత్రువు టిడిపికి శత్రువు వైసిపి. అందుకే అదే వైసీపీని మిత్రుడిగా భావించింది బిజెపి. కానీ రాజకీయాల్లో పరిస్థితి ఒకేలా ఉండదు. ఇక్కడ అవసరాలు పనిచేస్తాయి. ముఖ్యంగా పవర్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే టిడిపి ద్వారా లబ్ధి పొందింది బిజెపి. బిజెపి ద్వారా అవకాశాన్ని దక్కించుకుంది టిడిపి. అందుకే ఇప్పుడు ఆ రెండు పార్టీలు పరస్పర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాయి. మొన్నటి వరకు బిజెపికి స్నేహ పార్టీ వైసిపి. ఇప్పుడు మాత్రం టిడిపి కనిపిస్తోంది. టిడిపి వ్యతిరేకిస్తున్న వైసిపి బద్ధ శత్రువు గా మారింది. అందుకే వైసిపిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది బిజెపి. దానిని ఆహ్వానిస్తోంది టిడిపి. అందుకు జరిగే ప్రయోజనాలను బిజెపి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది.
వైసీపీ నిర్వీర్యం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ ప్లాన్. బిజెపి ద్వారా అమలు చేసి దాని ద్వారా కలిగే ప్రయోజనాలను అదే పార్టీకి కట్టబెట్టాలని టిడిపి భావిస్తోంది. వైసీపీకి గుడ్ బై చెప్పే నేతలను బిజెపిలోకి పంపించాలని చూస్తోంది. వైసీపీకి రాజీనామా ద్వారా కలిగే పదవులను సైతం బిజెపికి కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ విషయంలో జగన్ ఈ రాష్ట్రం నుంచి కనుమరుగు కావాలన్నది టిడిపి లక్ష్యం. దానిని నెరవేర్చే పని చేస్తోంది బిజెపి. అందుకు టిడిపి తగిన ప్రయోజనాలను బిజెపికి కల్పిస్తోంది. మొత్తానికైతే ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తూ ఆడుతున్న ఈ నాటకంలో బిజెపి నేరుగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోంది. వైసిపి అడ్డు లేకుండా భవిష్యత్తులో ప్రయోజనం పొందాలని టిడిపి చూస్తోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో జనసేన ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. అయితే ఆ పార్టీ సైతం కూటమిలో భాగస్వామ్యం కావడంతో అంతిమంగా ఇది వైసీపీకి నష్టం చేకూర్చే అంశంగా మారుతోంది.