నారా లోకేష్ ను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కొడుకుగా మాత్రమే ప్రజలకు తెలుసు కానీ తనకంటూ ఒక special imageని create చేసుకోలేకపోయారు. కనీసం సర్పంచ్ గా కూడా గెలవని లోకేష్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర చేస్తుంటే రాష్ట్ర ప్రజలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు కానీ మీమ్ పేజెస్, ట్రోల్ పేజెస్ మాత్రం లోకేష్ పాదయాత్ర కోసం చాల interesting గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లోకేష్ మీమ్ పేజెస్ కి, ట్రోల్ పేజెస్ కావలసిన ట్రోల్ మెటీరియల్ చాల ఇస్తాడు. లోకేష్ గతంలో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ట్రోల్ మెటీరియల్ ను వాళ్ళు ఇంకా వాడుకుంటున్నాడు.
లోకేష్ కు తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ కూడా కరెక్ట్ గా రాదు. తెలుగులో లోకేష్ మాట్లాడిన తప్పులను ఇంకా ఇప్పటికీ ట్రోల్ పేజెస్ వాడుకుంటున్నాయి. “మజ్జిగా తియ్యగా ఉంది” అని లోకేష్ అన్న మాటను మూవీస్ లో కూడా ట్రోల్ చేస్తున్నారు. అలాగే మచిలీపట్టణం పోర్ట్ ను జగన్ తెలంగాణకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడని చేసిన వ్యాఖ్యలను కూడా ట్రోల్ పేజెస్ ఇంకా use చేస్తున్నాయి, అలాగే “జీవోను” “జియో” అనడం, తండ్రిని భర్త అనడం, ట్రక్ ను ట్రేస్ అనడం ఇలా చాలా ఉన్నాయ్.
అలాగే లోకేష్ కు రాష్ట్ర, దేశ రాజకీయాల పట్ల గాని, ప్రజల సమస్యల పట్ల గాని ఎలాంటి అవగాహనా లేదు. అసలు ఏమి మాట్లాడుతాడో, ఎందుకు మాట్లాడుతాడో తెలియదు. మొన్నటి వరకు ప్రిపేర్ అయిన స్పీచెస్ ఇచ్చిన లోకేష్, ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. యువతను ఆకట్టుకుందామని వెళ్తున్న లోకేష్, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి కూడా లేదు. మొన్న చంద్రబాబు నాయుడే టీడీపీ పోవాలి,టీడీపీ పోవాలని మాట్లాడారు. ఇప్ప్పుడు లోకేష్ ఇంకెన్ని ట్రోల్ మెటీరియల్ ఇస్తాడో చూడాలి.