Tuesday, April 22, 2025

పవన్ ప్రాపకం కోసం.. జగన్మోహన్ రెడ్డి ని తిట్టిన బాలినేని!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక వెలుగు వెలిగారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టుడైన నేతగా ఉండేవారు. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఊసరవెల్లి కంటే రంగులు మార్చేలా ఉన్నారు. అంతకుమించి జనసేనలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు నమ్మకం కుదరాలంటే జగన్మోహన్ రెడ్డికి తిట్టడమే శరణ్యమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో అయీష్టంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారో నాటి నుంచి ఆయన రగిలిపోయారు. పార్టీని ఇరుకున పెట్టేలా అసంతృప్తి వ్యక్తం చేసేవారు. అలాగని పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు భయపడేవారు. బయటకు వెళితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌరవం దక్కదన్న భావనతో ఉండేవారు. అందుకే ఎన్నికల అనంతరం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జనసేనలో చేరారు.

జనసేనలో చేరే క్రమంలో ఒంటరిగా వెళ్లి పవన్ కళ్యాణ్ తో కండువా కప్పించుకున్నారు. మంది మార్బలం వద్దనడంతో సింపుల్ గా పని కానిచ్చేశారు. ఓ ద్వితీయ శ్రేణి నేత మాదిరిగానే పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే పార్టీలో చేరి నెలలు గడుస్తున్న బాలినేని సేవలను జనసేన వినియోగించుకోలేదు. ప్రభుత్వంలో ఎటువంటి పదవి లేదు. పార్టీ బాధ్యతలు కూడా ఇవ్వలేదు. దీంతో బాలినేనిలో అసహనం పెరిగింది. ఇంతలో జనసేన ప్లీనరీ వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి చేతిలో తాను మోసపోయానని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం ప్రయత్నించారు బాలినేని.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. రాజశేఖర్ రెడ్డి గుర్తించి యూత్ కాంగ్రెస్ లో ఉన్న బాలినేనిని రప్పించారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించారు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యేసరికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ అభిమానంతోనే బాలినేని జగన్మోహన్ రెడ్డితో పొలిటికల్ జర్నీ చేశారు.

అయితే తన ఆస్తిని జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని బాలినేని చెప్పడం మాత్రం విస్తు గొలుపుతోంది. బాలినేని విలాసపురుషుడని ప్రకాశం జిల్లాలో ఏ నేతను అడిగినా చెబుతాడు. గతంలో ఇదే టిడిపి బాలినేని ప్రత్యేక విమానంలో రష్యా వెళ్తే ఎంత గలాటా చేసిందో తెలియంది కాదు. పేకాట, ఇతరత్రా జూదం ఆటలో నిష్ణాతుడు బాలినేని అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. పేకాటలో డబ్బులు పోగొట్టుకొని.. ఆస్తులు అమ్ముకొని.. జగన్మోహన్ రెడ్డి కాజేసారని చెప్పడం బాలినేని అవివేకానికి నిదర్శనమని విమర్శలు చేశారు.

బాలినేని పేకాట ఆడేందుకే ప్రత్యేక విమానంలో రష్యా వెళ్తుంటారని ప్రకాశం జిల్లాలో ఒక విమర్శ ఉంది. పైగా ఆయన విలాస పురుషుడు కూడా. అలా పోగొట్టుకున్న ఆస్తిని జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేయడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. పైగా తాను మంచి వాడినని పవన్ కళ్యాణ్ అన్న రోజున జనసేనలో చేరి ఉండాల్సిందని.. తప్పు చేశానని బాలినేని అనడం కూడా హాట్ టాపిక్ అవుతోంది. అంటే ఏనాడైతే మంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి తొలగించారో అప్పటి నుంచే బాలినేని ఆలోచనలు మారాయి అన్నమాట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!