Monday, February 10, 2025

సాయి రెడ్డి ఎపిసోడ్ వెనుక.. చౌదరి గారి మంత్రాంగం!

- Advertisement -

విజయసాయి రెడ్డి ఎపిసోడ్ వెనుక ఓ కమ్మనేత ఉన్నారా? ఆయనే ఈ మొత్తం ఎపిసోడ్ నడిపించారా? త్వరలో రాష్ట్ర పగ్గాలు అందుకోనున్న ఆ నేత మంత్రాంగం నడిపారా? పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. 2029 ఎన్నికల నాటికి సరికొత్తగా రాజకీయాలు మారనున్నాయి. అప్పటికి ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీని డ్రాప్ చేయాలన్నది బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది. త్వరలో బిజెపి పగ్గాలు పురందేశ్వరి నుంచి వేరొకరు అందుకోనున్నారు. అయితే రకరకాల పేర్లు తెరపైకి వచ్చిన.. ఇప్పటికే అధ్యక్ష పదవి ఒక నేతకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ నేతకు సీఎం చంద్రబాబు అండదండలు కూడా ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. సొంత సామాజిక వర్గం నేతకావడంతో.. తన చెప్పు చేతల్లో ఉంటారని భావించి సిఫారసు చేసినట్లు సమాచారం. పైగా పూర్వాశ్రమంలో సదరు నేత తెలుగుదేశం పార్టీలో పని చేసిన వ్యక్తి. అందుకే భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని సదరు చౌదరి.. హై కమాండ్ తో కలిసి విజయసాయిరెడ్డి ఆపరేషన్ ను పూర్తిచేసినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ కమ్మ సామాజిక వర్గం నేత 2019 ఎన్నికల తర్వాత బిజెపిలోకి వెళ్లారు. బిజెపి టిడిపి మధ్య బ్రిడ్జ్ కట్టారు. పొత్తు కుదరచ్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఏపీలో పొత్తు వర్కౌట్ కావడంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఏపీ కారణమైంది. దీంతో సదరు చౌదరి పరపతి కేంద్రంలో పెరిగింది. కేంద్ర పెద్దలు కూడా చౌదరి గారికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన చౌదరి గారికి మంత్రి పదవి దక్కలేదు. అయితే త్వరలో ఆయనకు బిజెపి రాష్ట్ర పగ్గాలు ఇస్తారని తెలుస్తోంది. అయితే అదే చౌదరి గారితో కేంద్ర పెద్దలు ఒక మంత్రాన్ని నడిపినట్లు సమాచారం. అందులో భాగంగా వైసిపికి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం అని తెలుస్తోంది.

2029 ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీ డ్రాప్ అయితేనే ఆ స్థానంలోకి బిజెపి వస్తుంది. అది జరగాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ నిర్వీర్యం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కు కీలక భాగస్వామి. కేంద్ర పెద్దలకు చంద్రబాబు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. జనసేన ఇప్పటికే బలమైన మిత్రపక్షంగా ఉంది. సో ఇక మిగిలింది వైసిపి. వైసీపీని దెబ్బ తీయాలంటే ముందుగా దాని మూలాలను దెబ్బతీయాలి. జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యం పై దెబ్బ కొట్టాలి. అందుకే విజయసాయి రెడ్డి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కేసులతో భయపెట్టారు. ఎక్కడెక్కడ ఏఏ రూపాల్లో దెబ్బతీయాలో.. ఎలా భయపెట్టాలో అన్ని చేసి చూపించారు. అయితే ఎంతటి వారికైనా కుటుంబం ప్రాధాన్యం. వారికి ప్రమాదం ఉందంటే తప్పకుండా వెనక్కి తగ్గుతాం. అదే దెబ్బను విజయసాయి రెడ్డికి చూపించారు కేంద్ర పెద్దలు. అలా తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నారు.

అయితే విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ ఉంటానని చెప్పడం మాత్రం అంత నమ్మశక్యంగా లేదు. మున్ముందు విజయసాయిరెడ్డిని పావుగా వాడుకొని బిజెపిని బలోపేతం చేసుకోవాలన్న క్రమంలో వైసీపీని నిర్వీర్యం చేయడం ఖాయం. ఇక్కడ నుంచి ప్రతి నెల.. ప్రతిక్షణం విజయసాయిరెడ్డి ని పావుగా వాడుకుని జగన్ను ఇబ్బంది పెడతారు. వైసీపీని ముప్పు తిప్పలు పెడతారు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చౌదరి గారి ద్వారా నడిపించడానికి కేంద్ర పెద్దలు పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

2026 లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఎంపీ తో పాటు ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతుంది. దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. అంటే అసెంబ్లీ స్థానాలు సంఖ్య 225 కు చేరుకుంటుంది. పార్లమెంటు స్థానాలు సంఖ్య సైతం అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఈ పెరిగే క్రమంలో బిజెపి ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కోరుకుంటుంది. జనసేన సైతం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుకుంటుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సైతం ఆ రెండు పార్టీల సాయాన్ని సంపూర్ణంగా పొందుతుంది. అయితే ఇప్పుడు వైసీపీని నిర్వీర్యం చేయాలన్నది బిజెపి కేంద్ర పెద్దల ముందున్న లక్ష్యం. అందులో భాగంగానే బిజెపి రాష్ట్ర పగ్గాలు అందుకోనున్న చౌదరి గారితో ఈ మంత్రాంగం నడిపినట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!