విజయసాయిరెడ్డి నిజంగా రాజకీయ సన్యాసం చేస్తారా? మాటమీద నిలబడతారా? ఇక రాజకీయాల జోలికి వెళ్ళరా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. రాజశేఖర్ రెడ్డి అంటే ఏదో అల్లాటప్ప నేత కాదు. దశాబ్ద కాలంలో రాజకీయాలను అవపోషణ పట్టేశారు. వృత్తిరీత్యా చార్టర్ అకౌంటెంట్ అయినా.. రాజకీయాల్లో అందరి లెక్కలను అంచనా వేసే ఘనుడు ఆయన. రాజశేఖర్ రెడ్డి కుటుంబ మద్దతు దారుడిగా ప్రస్థానం ప్రారంభించి.. అదే కుటుంబానికి చిట్టాపద్దులు రాసే చాటర్డ్ అకౌంటెంట్ గా మారి.. జగన్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనుడు ఆయన. జగన్ రాజకీయాల్లో ముందు ఉంటే.. వెనుక ఉండి నడిపించాడు ఆయన. అటువంటి వ్యక్తి రాజకీయాలకు దూరమవుతాడు అంటే నమ్మశక్యం కాదు. రాజకీయం రుచి మరిగిన వ్యక్తి ఆయన. కచ్చితంగా దీని వెనుక ఏదో ఒక వ్యూహం ఉందన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం.
రాజకీయాలయందు జగన్ రాజకీయం వేరయా.. వైసీపీ అధినేత రాజకీయం. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో జగన్ కి ఎరుక. అందుకే జగన్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పోల్చుతారు. చుట్టూ ఉన్న దేశాలు సహాయ నిరాకరణ చేసిన.. అగ్రరాజ్యం అమెరికా ప్రత్యర్థగా మారిన.. వెన్ను చూపని ధైర్యం పుతిన్ సొంతం. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ రష్యాను అగ్ర పధంలో నిలిపిన ఘనత ఆయనది. అయితే అటువంటి నిర్ణయాలే జగన్ తీసుకుంటారని రాజకీయ వ్యూహకర్తలు అభిప్రాయపడుతుంటారు. పుతిన్ మాదిరిగా జగన్ నిర్ణయాలు ఉంటాయని అభివర్ణిస్తుంటారు. అయితే అందులో కొంతవరకు వాస్తవం ఉంది కూడా. జగన్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు అటువంటివి. తండ్రి అకాల మరణంతో చనిపోయిన వారిని పరామర్శించడానికి బయలుదేరారు జగన్. కానీ అడ్డగించింది కాంగ్రెస్ నాయకత్వం. అప్పటికే భారతదేశన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా సరే లెక్క చేయలేదు. కనీసం లెక్కల్లోకి తీసుకోలేదు. జైలులో పెట్టిన వెరవలేదు. అయితే అదే దూకుడుతో వైసీపీని ఏర్పాటు చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. అయితే తన కష్టంలోనూ, తన సుఖంలోనూ, తన విజయంలోను కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డిని ఆయన వదులుకుంటారా? అది నమ్మశక్యమేనా?
వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి బిజెపి నేతలకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారని ప్రచారం జరుగుతుంటుంది. కేవలం కేంద్ర పెద్దల పొగడ్తలకే ఆయన సోషల్ మీడియా అకౌంట్ ను ఒక ఏజెన్సీకి అప్పగించారంటే ఆయన తెలివితేటలు అదుర్స్. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గడిపింది ఎక్కువ ఢిల్లీలోనే. కేంద్రానికి వైసీపీ అధినేత జగన్కు వారధిగా నిలిచిన క్రమంలో ఆయన జాతీయస్థాయిలో పరపతిని అమాంతం పెంచుకున్నారు. వైసిపి ఓడిపోయిన తర్వాత కూడా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను ఆరు నెలల్లో అరడజనులు సార్లు కలిసారంటే ఆయన స్టామినో ఏ స్థాయిలో తెలియంది కాదు. అటువంటి వ్యక్తి రాజకీయం సన్యాసం చేశారంటే ఎలా నమ్మాలి? పైగా బీజేపీలో చేరేందుకు మార్గం ఉంది. కానీ ఆయన రాజకీయ సన్యాసం అనే ఎత్తుగడవేశారన్న అనుమానాలు ఉన్నాయి.
గడిచిన ఆరు నెలల కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ అవే పరిణామాలు కొనసాగుతున్నాయి. ఏపీలో కూటమి పార్టీల మధ్య పట్టు సడలుతోంది. లోకేష్ ను ప్రమోట్ చేయాలన్న ఆరాటం తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం అవసరమైతే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్.. ఇలా ఎన్నెన్నో డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. పనిలో పనిగా చిరంజీవిని బిజెపి లోకి తేవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇటువంటి కీలక పరిణామాల నడుమ విజయసాయిరెడ్డి తెర వెనుక మంత్రాంగం నడుపుతారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో టిడిపి ఎంతగానో ఆనందపడింది. కానీ ఒకవైపు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, ఇంకోవైపు బిజెపి పెద్దల నడవడిక చూసి ఆందోళన చెందుతోంది. వైసీపీలో విజయసాయిరెడ్డి ఉంటే అభ్యంతరాలు లేవు. కానీ ఆయన రాజకీయ సన్యాసం అనేటప్పటికీ అనేక అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఎక్కువ భయం మాత్రం టిడిపికే. ఎక్కడో తేడా కొడుతోంది అన్న అనుమానం ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.