Monday, February 10, 2025

నేతల జంపింగ్ కామన్.. తెలుగు రాష్ట్రాల్లో ఇది సర్వసాధారణం

- Advertisement -

వైసీపీ అధినేత జగన్ పని అయిపోయిందా? పార్టీని మూసుకోవాల్సిందేనా? చివరకు ఆయనే మిగులుతారా? ఇటీవల ఇటువంటి మాటలు తరచు వినిపిస్తున్నాయి. ప్రత్యర్ధులు ఈ ఆరోపణలు చేస్తుండగా సోషల్ మీడియా హోరెత్తుతోంది. అయితే అందులో నిజం ఎంత? అంటే మాత్రం…అది ఎంత మాత్రం నిజం కాదంటున్నారు విశ్లేషకులు. వైసీపీకి 40 శాతం ప్రజలు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గెలుపోటములను పక్కన పెడితే వైసీపీ ఉండదన్న ప్రచారం మాత్రం ఉత్తదేనని తేల్చి చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

2019లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లారు. అప్పటికే తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉంది. 2004లో ఓటమి చవిచూసి ఉంది. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న దేవేందర్ గౌడ్, కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, గంటా శ్రీనివాసరావు, భూమా నాగిరెడ్డి లాంటి హేమహేమీలు వెళ్లిపోయారు. ఒకరి కాదు ఇద్దరు కాదు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది టిడిపి నేతలు పార్టీని వీడారు. వెళుతూ వెళుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్లారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. ప్రజారాజ్యం పార్టీ ఉనికి చాటుకోలేకపోయింది. అలా ఓటమి ఎదురైన తర్వాత నేతలంతా మళ్ళీ టిడిపి గూటికి వచ్చారు.

అయితే ఇప్పుడు వైసీపీని వీడి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. రకరకాల కారణాలతో వీరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కేసులకు భయపడి కొందరు, రాజకీయ భవిష్యత్తు వెతుక్కుని మరికొందరు, అధికారానికి చెరువు అవుదామని ఇంకొందరు పార్టీని మారుతున్నారు. అయితే వారంతా ఆ పార్టీల్లో ఉండిపోతారా? తిరిగి రారా? అంటే మాత్రం ఇట్టే సమాధానం వస్తోంది. సిద్ధాంతాలు, మనస్సాక్షిలు పనిచేయని రోజులు ఇవి. పైగా గత అనుభవాలు ఇట్టే తెలియజేస్తున్నాయి. మళ్లీ జగన్ బలపడినా, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పలుచన అయినా.. ఇలా వెళ్లిన నేతలంతా తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఖాయం. అది జగమెరిగిన సత్యం కూడా.

పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేది కొద్దిమంది నేతలు మాత్రమే. అయితే జాతీయ పార్టీగా ఉన్న బిజెపిలో మాత్రం నేతలు స్థిరంగా ఉంటారు. 90 శాతం మంది నాయకులు కాషాయ దళాన్ని నమ్ముకుంటారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి మూలాల నుంచి వచ్చిన వారు బిజెపిలోనే కొనసాగగలరు. కాంగ్రెస్ పార్టీలో సైతం పాతతరం నేతలు ఇతర పార్టీల్లో సర్దుబాటు కాలేరు. వామపక్ష భావజాలం ఉన్నవారు ఆ పార్టీలోనే కొనసాగుతారు. అవసరాల రీత్యా ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఎక్కువ రోజులు అక్కడ గడపలేరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అందుకు విరుద్ధం. ఇక్కడ అవసరాలు బాగా పనిచేస్తాయి. అధికారానికి వెతుక్కుంటూ ఎక్కువ మంది నేతలు వెళుతుంటారు. ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్లిన వారంతా అవసరానికి వెళ్లిన వారే. రేపు జగన్ ప్రజల మధ్యకు వచ్చి బలపడిన.. కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయినా ఈ నేతలంతా తిరిగి రావడం ఖాయం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!