Sunday, March 16, 2025

వైయస్సార్ కాంగ్రెస్ నేతలు నా ఫ్రెండ్స్.. అదంతా తప్పుడు ప్రచారం అంటున్న బ్రహ్మాజీ!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చాలాసార్లు కుట్ర జరిగింది. ప్రధానంగా గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలుగు చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా మార్చేశారు. ఈ విషయంలో ఒక పద్ధతి ప్రకారం అణచివేసే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా సినిమా టిక్కెట్ల ధర విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం చిత్ర పరిశ్రమ లో కొన్ని వర్గాలకు ఇష్టపడలేదు. పైగా దుష్ప్రచారం చేసి చిత్ర పరిశ్రమలో ఒక రకమైన ఆందోళన తీసుకొచ్చారు. చిత్ర పరిశ్రమకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం అని చిత్రీకరించారు. ఈ తరుణంలోనే కొంతమందితో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించారు. అటువంటి వారిలో సినీ నటుడు బ్రహ్మాజీ ఒకరు.

వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో బ్రహ్మాజీ యాక్టివ్ గా ఉండేవారు. ఆయన స్వతహాగా చంద్రబాబు అభిమాని. కానీ ఆయన వైసీపీ నేతలతో సైతం సన్నిహితం ఉంది. కానీ నాడు జగన్ సర్కార్ వైఫల్యాలపై బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ప్రశ్నించారు అంటూ ట్రోల్ చేశారు. దానినే ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. వాస్తవానికి తాను ఎప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని బ్రహ్మాజీ తాజాగా చెప్పుకొచ్చారు. అదంతా సోషల్ మీడియాలో అభూత కల్పన అని.. అసలు చిత్ర పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం ఏంటి అని బ్రహ్మాజీ ప్రశ్నించడం విశేషం.

ఇటీవల ఓ సినిమా వేడుకలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో 151 గొర్రెలు ఉండేవని.. ఇప్పుడు 11 మాత్రమే ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను ఉద్దేశించి మాట్లాడారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. దీనిపై వైసీపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ప్రారంభం అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విని టార్గెట్ చేసుకున్నారు. ఈ దెబ్బకు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పారు. అయితే దీనిని తప్పు పట్టారు బ్రహ్మాజీ. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. దానిని తప్పుడు చర్యగా అభిప్రాయపడ్డారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి చేసినది ఘోర తప్పిదమన్నారు.

సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ.. మరొకరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలన్నారు. తనను గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిగా ముద్రించారని.. కానీ తనకు జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది స్నేహితులు ఉన్నారని గుర్తు చేశారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వారిని బాధించిందని తెలిసిన మరుక్షణం డిలీట్ చేసే వాడిని అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని.. బాధ్యత గుర్తిరిగి వ్యవహరించాలని అంటున్నారు బ్రహ్మాజీ.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!