Tuesday, April 22, 2025

చెవిరెడ్డి ఫుల్ సైలెంట్.. కారణం అదే!

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ అయ్యారా? కేసులకు భయపడుతున్నారా? కూటమి దూకుడుకు ఆందోళనతో ఉన్నారా? అందుకే పార్టీ యాక్టివిటీస్ ను తగ్గించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీలోని కీలక నేతలపై కూటమి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో సీనియర్ నేతగా ఉన్న చెవిరెడ్డి ఫుల్ సైలెంట్ కావడం అనుమానాలకు తావిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక వలయం ఉంటుంది. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి .. ఇలా చెప్పుకుంటూ పోతే శత్రు దుర్భేద్యం లాంటి భారీ వలయమే ఉండేది. అయితే 2024 ఎన్నికలకు ముందు ఈ టీంలో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ ఒంగోలులో ప్రత్యేక అవసరాల దృష్ట్యా భాస్కర్ రెడ్డితో ఎంపీగా పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చిన అవకాశాలు ఎవరికీ ఇవ్వలేదు జగన్ మోహన్ రెడ్డి. ఎక్కడో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పిలిచి చంద్రగిరి టిక్కెట్ ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వలేదు గాని విప్ పదవి ఇచ్చి గౌరవించారు. చెవిరెడ్డి సైతం ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 2019లో రెండోసారి చంద్రగిరి నుంచి ఎన్నికైన భాస్కర్ రెడ్డి రాజకీయంగా కూడా కీలకంగా మారారు. కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకొని తాను జగన్ టీం లోకి వచ్చేసారు. అయితే అనూహ్యంగా ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కూడా దక్కించుకున్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేత వెళ్లిపోవడంతో.. చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ జగన్ టీం లో సభ్యుడిగా, ప్రకాశం జిల్లా బాధ్యుడిగా మాత్రం కనీసం భాస్కర్ రెడ్డి స్పందించడం లేదు. పార్టీ హై కమాండ్ ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

కూటమి పెట్టె కేసులకు భయపడి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పై కూటమి ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో కేసులు తప్పవని ఆ తండ్రీకొడుకులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి కుటుంబానికి మంచి పొజిషన్ కల్పించారు. కానీ ఇవేవీ ఆలోచించకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ కావడానికి మాత్రం హై కమాండ్ సీరియస్ తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!