Tuesday, April 22, 2025

రాయదుర్గం వైసీపీలో విభేదాలు.. కాపు రామచంద్రారెడ్డి రాకకు ఎదురుచూపు!

- Advertisement -

రాయదుర్గం వైసీపీలో పతాక స్థాయికి చేరుకున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టు గోవిందరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆయనకు ఓటమి ఎదురైంది. అయితే వైసిపి శ్రేణులను సమన్వయం చేయడంలో మెట్టు గోవిందరెడ్డి ఫెయిల్ అవుతున్నట్లు ప్రచారం ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి రాయదుర్గం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ప్రయోగం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఆ ప్రయోగాన్ని ప్రజలు విశ్వసించలేదు.

ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చారు మెట్టు గోవిందరెడ్డి. 2019 ఎన్నికల్లో గెలిచిన కాపు రామచంద్రారెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న రామచంద్రారెడ్డిని తప్పించి గోవిందరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇది నచ్చని కాపు రామచంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది.

అయితే ఎన్నికల అనంతరం మెట్టు గోవిందరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోలేకపోతున్నారు. దీంతో అక్కడ స్పష్టమైన లోటు కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరుగుతోంది. ఈ తరుణంలో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

త్వరలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. బలమైన క్యాడర్ కలిగిన కాపు రామచంద్రారెడ్డి రీఎంట్రీ ఇస్తే ఇక్కడ పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి.

2004 నుంచి కాపు రామచంద్రారెడ్డి అక్కడ సత్తా చాటుతున్నారు. 2009 ఎన్నికల్లో సైతం గెలిచారు. అయితే కాపు రామచంద్రారెడ్డి పై వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పించారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి నమస్కరిస్తూ ఆయన గౌరవంగా పార్టీ నుంచి తప్పుకున్నారు. బిజెపిలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చింది కానీ కాపు రామచంద్రారెడ్డికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వైసిపికి ఇబ్బందులు తప్పినట్టే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!