అనుకున్నదే అయింది. హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోను పూర్తిగా రాజకీయంగా మార్చేశారు. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో .. రెండో సీజన్ కోసం చాలామంది అభిమానులు అతృతుగా ఎదురు చూశారు. కాని రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌తోనే తమ వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పేశారు షో యాజమాన్యం. అన్ స్టాపబుల్ షో అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నారు. అల్లు అరవింద్ పవన్ కల్యాణ్‌కు బంధువు కాబట్టి ఎలాగు ఆయన పవన్‌కు అనుకులంగానే పని చేస్తారు. అన్ స్టాపబుల్ షోకు హోస్ట్‌గా పని చేస్తున్న బాలయ్య కూడా పవన్ కల్యాణ్‌కు దగ్గర కావాలని చూస్తున్నారు. ఇవ్వన్ని కలగలిసి ఏపీ సీఎం జగన్ టార్గెట్‌గా అన్ స్టాపబుల్ షో సాగుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం కలుగడం లేదు.
జగన్ వ్యతిరేకులందరిని ఏకం చేస్తూ ఈ షోను నిర్వహిస్తున్నారని పక్కాగా అర్థం అవుతుంది. తాజాగా ఈ షోకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబందించిన ఎపిసోడ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఈ సందర్భంగా పలువురు మదిలో బాలయ్య పవన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఈ షోతో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయం అయిపోతాయ్ అని వ్యాఖ్యనిస్తున్నారు.విద్యావంతులు మాత్రం బాలయ్య పవన్‌ను కొన్ని ప్రశ్నలు అడిగితే చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఆ ప్రశ్నలు ఏమిటో మనం కూడా ఓసారి చూద్దాం.
జగన్ , పవన్ ఇద్దరు కూడా ఇంచుమించు ఒకేసారి పార్టీ పెట్టారు కదా.. మరి జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. పవన్ ఎక్కడ ఉన్నారు.. దీనికి కారణం ఏమిటని బాలకృష్ణ పవన్‌ను ప్రశ్నిస్తే బాగుంటుందని చాలామంది తమ అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఉన్న 175 సీట్లలో జగన్ తప్పితే మరే పార్టీకి కూడా అభ్యర్థులు లేరు కదా.. ఇది ఎవరి అసమర్థత అని ప్రశ్నిస్తే బాగుండు అని నెటిజన్లు చెబుతున్నారు. జగన్ అంటే పవన్‌కు ఎందుకు నచ్చదు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే చాలా బాగుంటుందని విశ్లేషకులు తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న నచ్చలేదు.. అధికారంలో ఉన్న నచ్చలేదు. దీనికి పవన్ ఈషో ద్వారా క్లారిటీ ఇస్తే బాగుంటుందని చాలామంది చెబుతున్నారు. మరి షో ద్వారా అయిన పవన్ ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తారో చూడాల్సి ఉంది.