Saturday, October 5, 2024

AP Politics:బయటపడ్డ టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల బాగోతం

- Advertisement -

AP Politics:ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల సెక్స్ భాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతలు రాసలీలల బాగోతం బట్టబయలు కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డారంటూ ఆదిమూలంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన పైన ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీ టీడీపీ అధినేతకు లేఖ రాశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్షగట్టి , అసభ్యకరంగా ప్రవర్తిస్తూ , తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వరలక్ష్మీ తెలిపారు. కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికి, ఆయన నుంచి వేధింపులు ఎక్కువైయ్యాయని, ఆ తర్వాత నన్ను భయబ్రాంతులకు గురి చేసి, నన్ను లైంగికంగా చెరిచాడని ఆమె చెప్పారు.

ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతూ లైంగిక కోరికలు తీర్చాలని ఈ కామంధుడు టార్చర్ చేస్తున్నాడని తెలిపింది.అతని వేధింపులు భరించలేక నా భర్త ఇచ్చిన సూచనలతో, కోనేటి ఆదిమూలం బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో హోటల్‌లో సిక్రెట్ కెమెరాతో , ఎమ్మెల్యే కామ క్రీడలను రికార్డు చేశామని వరలక్ష్మీ తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలన్ని కూడా పోలీసులకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. మరి దీనిపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!