టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం పెద్ద వివాదంగా మారింది. గత రాత్రి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొన్నారు చంద్రబాబు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులలో ప్రమాదవశాత్తు 8 మంది మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ 8 మంది మరణానికి చంద్రబాబే కారణం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. తన రాజకీయ లబ్ది కోసం ప్రజల ప్రాణాలను చంద్రబాబు పణ్ణంగా పెట్టారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తన సభలకు భారీ ప్రజలు హాజరైయ్యారని చెప్పుకోవడానికే చాలా చిన్న ప్రదేశాలలో.. ఇరుకు సంధుల్లో చంద్రబాబు బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిని ఎల్లో మీడియా తమకు అనుకులంగా మార్చుకుంటూ..చంద్రబాబు సభలకు భారీగా జనాలు వస్తున్నారని చూపించాలని పిచ్చి యావతో చేసిన పనే ఇది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా టీడీపీ యువనేత నారా లోకేష్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. నారా లోకేష్ వచ్చే జనవరి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారనే విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పాదయాత్రకు పేరుతో పాటు పోస్టర్‌ను కూడా టీడీపీ నాయకులు విడుదల చేశారు. నారా లోకేష్ పాదయాత్రకు యువగళంగా నామాకరణం చేశారు. జనవరి 27 నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. పాదయాత్ర అలా ప్రకటించారో లేదో ఇలా 8 మంది ప్రాణాలు పోయాయని సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ మీద సైటర్లు వేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎం అయిన వెంటనే గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించారని ..లోకేష్ పాదయాత్ర మొదలు కాకుండానే 8 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా చంద్రబాబు తీరు వల్ల 8 ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.