ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు తమ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని..వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యనించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ డిమాండ్లు నెరవేరలేదన్న ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. పీఆర్సీ, జీతభత్యాల విషయంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందని తెలిపారు. పైగా ఎన్నికల డ్యూటీ నుంచి కూడా తప్పించామనే కోపంతో వారు ఉన్నారని.. వారంత కూడా వైసీపీకి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయిన వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వనికి ఎటువంటి ఢోకా లేదని..వైసీపీ ఎమ్మెల్యే వెల్లడించారు.
లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల చేత వైసీపీకి ఓటు వేయిస్తే మళ్లీ జగన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణను విస్మరించకూడదని, విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం అవుతారని.. దీనిలో ఎటువంటి అనుమానం లేదని.. ఇది ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలపడం జరిగింది. 2024లో జరిగే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో మళ్లీ అన్ని స్థానాలు కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుందని.. జిల్లా ప్రజలు వైఎస్ఆర్ కుటుంబానికి సిద్దంగా ఉన్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యనించారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధమని రాచమల్లు సవాల్ విసిరారు. ప్రజలు తిరిగి వైసీపీని ఆశీర్వదిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.