Sunday, March 16, 2025

వైసీపీలోకి గాలి జగదీష్.. టిడిపికి షాక్

- Advertisement -

రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగలనుందా? ఓ సీనియర్ నేత కుటుంబానికి చెందిన వారసుడు వైసీపీలో చేరనున్నారా? జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకొనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏ కుటుంబానికి చెందినవారు? అంటే వాచ్ దిస్ స్టోరీ.

చిత్తూరు జిల్లా లో సీనియర్ పొలిటీషియన్లలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒకరు. ప్రస్తుతం ఆయన వారసుడిగా గాలి భాను ప్రకాష్ నగిరి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆర్కే రోజా పై గెలిచారు. ఆమె హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకున్నారు. అయితే అనూహ్యంగా గాలి కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గాలి చిన్న కుమారుడు జగదీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సోదరుడు గాలి భాను తీరుపై తీవ్ర ఆగ్రహంగా కూడా ఉన్నారు. తనను తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు అన్యాయం చేశారని ఆవేదనతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. జిల్లాకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్యవర్తిత్వంతో.. త్వరలో ఆయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని.. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయమని సమాచారం.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు కూడా. తెలుగుదేశం పార్టీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. లక్ష్మీపార్వతి కి అండగా నిలిచారు. అందుకే ఆయనకు చంద్రబాబు తగినంత గుర్తింపు ఇవ్వలేదు. ఆ కారణంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ముద్దుకృష్ణమ. కానీ 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. నగిరి నుంచి ఓడిపోయిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇంతలోనే ఆయన హఠాన్మరణం చెందారు. ఆయన వారసత్వానికి ఇద్దరు పిల్లలు పోటీపడ్డారు. దీంతో చంద్రబాబు ఆయన భార్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

అయితే 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు భానుకు టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ సమయంలోనే కలత చెందారు చిన్న కుమారుడు జగదీష్. అయితే వచ్చే ఎన్నికల్లో చూద్దాం అంటూ చంద్రబాబు సముదాయించేసరికి మెత్తబడ్డారు. కానీ ఆ ఎన్నికల్లో భాను ఓడిపోయాడు. గత ఐదేళ్లుగా సోదరులు ఇద్దరు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఏరా ఎన్నికలకు ముందు చంద్రబాబును టికెట్ అడిగారు జగదీష్. కానీ అధినేత మాత్రం మళ్లీ భానుకు టికెట్ ఇచ్చారు. తీవ్ర మనస్థాపానికి గురైన జగదీష్ మౌనంగా ఉండిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు గాలి భాను. గెలిచిన నాటి నుంచి జగదీష్ ను తొక్కడం ప్రారంభించారు. ఇదే విషయం పై హై కమాండ్ కు ఫిర్యాదు చేసిన అధినేత పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. తెలుగుదేశంతో పాటు తన సోదరుడిని దెబ్బతీయాలని జగదీష్ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీమంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని చాలామంది వైసిపి నేతలు వ్యతిరేకించారు. కానీ రోజా విధేయతను పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే ఓడిపోయిన నాటి నుంచి నగిరి నియోజకవర్గానికి ఆమె దూరంగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో గాలి జగదీష్ వైసీపీలో చేరుతుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. పుత్తూరు నుంచి ఏకంగా నాలుగు సార్లు గెలిచారు. పునర్విభజనలో ఆ నియోజకవర్గం కనుమరుగయింది. కొంత భాగం నగిరిలో కలిసింది. ఈ తరుణంలో నగిరిలో గాలి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఇప్పుడు అదే కుటుంబ వారసుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం సర్వత్ర ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అన్న అంచనాలు కూడా ప్రారంభమయ్యాయి

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!