Wednesday, March 19, 2025

కందుకూరులో మహీధర్ రెడ్డి యాక్టివ్.. జగన్ నుంచి పిలుపు!

- Advertisement -

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడిచారు. కానీ తాను అనుకున్న మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో సమీకరణలో భాగంగా ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కకు తప్పించారు. అయినా సరే పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. కానీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. త్వరలో సదరు నేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు.ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ?

వైసీపీలో సీనియర్ నేతగా పేరు ఉన్న మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీ మారుతున్నారని టాక్ వినిపిస్తోంది. నాలుగు సార్లు కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచారు మహీధర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా కూడా పని చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆరు దశాబ్దాల నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని శాసిస్తోంది మానుగంట కుటుంబం. మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల ముందు వరకు మహీధర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లోనే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో మూడుసార్లు గెలిచారు మహీధర్ రెడ్డి. 2019 ఎన్నికల్లో నాలుగోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. దీంతో మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ వివిధ సమీకరణల్లో ఛాన్స్ దక్కలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు మహీధర్ రెడ్డి. దీనికి తోడు ఈ ఎన్నికల్లో మహీధర్ రెడ్డిని పక్కన పెట్టింది వైసీపీ హై కమాండ్.

ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చేర్పులు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 2019 నుంచి ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మహీధర్ రెడ్డికి కాదని కందుకూరు టికెట్ను కనిగిరి ఎమ్మెల్యే గా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ కు ఇచ్చారు జగన్. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మహీధర్ రెడ్డి వర్గీయులు. అదే సమయంలో మహిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. కానీ ఆయన వైసీపీలోనే కొనసాగారు తనకు కాదని మరొక నియోజకవర్గం నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇచ్చిన అందరూ సహకరించి గెలిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పార్టీతోపాటు అధినేత జగన్ పట్ల పూర్తి విధేయతతో ఉన్నారు మహీధర్ రెడ్డి. అయితే ఇటీవల పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. సైలెంట్ గా ఉన్నారు.

మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహీధర్ రెడ్డి సైతం పార్టీ మారుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి మహిధర్ రెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మహీధర్ రెడ్డి సిద్ధపడుతున్నారు. మహిధర్ రెడ్డితో చర్చలు జరిపాక కందుకూరి నియోజకవర్గ ఇన్చార్జిగా తిరిగి మహిధర్ రెడ్డిని నియమిస్తారని టాక్ నడుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గంలో వైసిపి యాక్టివ్ అవుతుందని అంతా భావిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!