Wednesday, March 19, 2025

టిడిపి తో తాడోపేడోకు కొలికపూడి సిద్ధం… అవసరమైతే రెబల్?

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. అధినేత చంద్రబాబు ఆదేశాలను ఎమ్మెల్యేలు కనీసం ఖాతరు చేయడం లేదు. మొన్న ఆ మధ్యన రాయలసీమలో పరిస్థితి కొట్టుకున్నంత వరకు వచ్చింది. తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ఈ ఎపిసోడ్ లో ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు వెనుకేసుకొచ్చారన్న ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు అదే ఆదినారాయణ రెడ్డి తో బిజెపి ఎంపీ సీఎం రమేష్ వైరం పెంచుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ రెండు ఎపిసోడ్లు అలానే కొనసాగుతుండగా మళ్లీ తెరపైకి వచ్చారు వివాదాస్పద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఇటీవల ఆయన క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. వివరణ ఇచ్చుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఓ టిడిపి కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కొలికపూడి తీరుతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సదరు బాధితుడు వీడియో తీసి మరి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో కోలిక పూడి తీరు మారలేదని అర్థమవుతోంది. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే పై కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టిడిపి నుంచి పొమ్మన లేక పొగ పెడుతున్నారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి.

అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపూడి. అమరావతికి మద్దతుగా గట్టి వాయిస్ వినిపించారు. టీవీ డిబేట్లో సైతం పాల్గొనేవారు. ఈ క్రమంలోనే ఒక టీవీ ఛానల్ అధినేత కొలికపూడి పేరును చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. రిజర్వుడు నియోజకవర్గ కావడంతో చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో కూలిక పూడి గెలిచారు. కానీ అప్పటివరకు ఆ నియోజకవర్గంలో పెత్తనం చేసిన ఇతర సామాజిక వర్గ టిడిపి నేతలకు ఇది మింగుడు పడడం లేదు. అప్పటినుంచి అదే పనిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నది ఒక ఆరోపణ. అయితే హై కమాండ్ మాత్రం ఎమ్మెల్యే కూలికపూడి పైనే ఎక్కువగా రియాక్ట్ అవుతోంది. దీంతో ఆయన సహనం దెబ్బతింటున్నట్లు తెలుస్తోంది. అవసరం అయితే తాడోపేడోకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వాస్తవానికి కొలికపూడికి మంచి పేరు ఉంది. విద్యాధికుడు కావడంతో అన్ని అంశాలపై పట్టు ఉంది. అటువంటి నేతపై వివాదాస్పదుడు అనే ముద్ర వేయడానికి సొంత పార్టీ నేతలే కారణమని తెలుస్తోంది. అయితే హై కమాండ్ కు నియోజకవర్గ పరిస్థితులు తెలిసినా.. తననే తప్పుపడుతుండడంపై కూలిక పూడి తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే పార్టీ హై కమాండ్ తో తేల్చుకునేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే ఇలానే ముదిరితే మాత్రం టిడిపికి రెబెల్ గా మారేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి మున్ముందు కొలికపూడి చర్యలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!