Wednesday, March 19, 2025

రాజాం నియోజకవర్గ వైసీపీకి కొత్త బాస్!

- Advertisement -

ఆ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. పార్టీ ఆవిర్భావం తర్వాత హవా నడిచింది. రెండుసార్లు తిరుగులేని విజయం సాధించింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీ ఓడిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఇప్పటికీ అభిమానిస్తూనే ఉన్నారు. కానీ వారిని అక్కున చేర్చుకునే నాయకత్వం కరువైంది. దీంతో అక్కడ బలమైన నేతకు బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదంటే వాచ్ థిస్ స్టోరీ.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం ఇది. గతంలో ఉనుకూరు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. రెండు కుటుంబాల మధ్య పోరు పతాక స్థాయిలో జరిగేది. కిమిడి వర్సెస్ పాలవలస అన్నట్టు పరిస్థితి ఉండేది. కిమిడి కళా వెంకట్రావు సొంత ప్రాంతం ఇది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ హవా నడిచింది.

2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంబాల జోగులు పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా ఉన్న సీనియర్ నాయకురాలు ప్రతిభ భారతి పై గెలిచారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ను రప్పించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో ఆయనకు టిడిపి టికెట్ ఇచ్చారు. అయినా సరే రెండోసారి పోటీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కంబాల జోగులుకు రాజాం ప్రజలు పట్టం కట్టారు.

అయితే 2024 ఎన్నికల్లో ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను అనకాపల్లి జిల్లా తుని పంపించారు. ఇక్కడ మాత్రం పక్క నియోజకవర్గానికి చెందిన వైద్యుడు తలే రాజేష్ ను ఎంపిక చేశారు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ రాజేష్ ఓడిపోయారు. అయితే ఓడిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనలేదు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రాజేష్ వైద్యం పట్ల మొగ్గు చూపుతున్నారు. దీంతో రాజాం నియోజకవర్గానికి సరైన అభ్యర్థి అవసరం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

మరోవైపు తుని నుంచి పోటీ చేసిన కంబాల జోగులు తిరిగి ఇంచార్జ్ బాధ్యతలు కోరుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన అనుచరుడు ఒకరిని రాజాం పంపించేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ కావడంతో రాష్ట్రస్థాయిలో ఎస్సీ సామాజిక వర్గ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికం. త్వరలో ఒక నాయకుడిని రాజాం పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!