Wednesday, March 19, 2025

పిఠాపురంలో టిడిపి కౌన్సిలర్ల రాజీనామా?

- Advertisement -

పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. తమ నేత త్యాగానికి సరైన గుర్తింపు లభించకపోవడం పై వారు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే టిడిపికి గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నారు. తమ నేత విషయంలో పార్టీ హై కమాండ్ తీరు తప్పు అని తేల్చి చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అక్కడ టిడిపిలో బలమైన ముద్ర చాటుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక్కడ టిడిపి పటిష్టమైన స్థితిలోనే ఉంది. గత ఐదేళ్లుగా టిడిపిని అత్యంత బలమైన శక్తిగా మార్చారు వర్మ. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ టికెట్ దక్కించుకోవడంతో వర్మకు పని లేకుండా పోయింది.

రాష్ట్రస్థాయిలో టిడిపి బలపడాలంటే జనసేనతో కలవాలి. అలా చేయాలంటే పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకోవాలి. పవన్ కళ్యాణ్ ను సాదరంగా ఆహ్వానించాలి. ఆయనను గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఇలా ఆలోచన చేశారు వర్మ. తన అనుచరులను సముదాయిస్తూ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పోరాటం చేశారు. కానీ ఆ పోరాటానికి తగినంత గుర్తింపు లేకుండా పోయింది.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వర్మకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అనుచరులు భావించారు. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప.. వర్మకు పదవి దక్కిన దాఖలాలు లేవు. కనీసం ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పదవులు ప్రకటన సమయంలో వర్మ పేరు వస్తుందని ఆశించడం.. తరువాత ముఖం చాటేయడం పరిపాటిగా వస్తోంది.

ఈసారి కూడా వర్మకు మొండి చేయి చూపారు. ఎమ్మెల్సీ పదవీ ఇవ్వకుండా అవమానపరిచారు. దీనిని తట్టుకోలేకపోతున్నారు వర్మ అనుచరులు. పిఠాపురం మున్సిపాలిటీలో టిడిపికి కౌన్సిలర్లు ఉన్నారు. వర్మ అంటే ఇష్టపడే నాయకుల అధికం. అందుకే వారంతా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. చాలామంది నాయకులు పార్టీలో ఉండడం వేస్ట్ అని వర్మ కు నచ్చ చెబుతున్నట్లు సమాచారం.

ఇప్పుడు వర్మ కు ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తారు. అయితే నియోజకవర్గంలో మాత్రం వర్మకు ఎటువంటి గౌరవం దక్కదు. ఆ విషయం వర్మ అభిమానులకు తెలుసు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. అందుకే ఎక్కువమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుదామని వర్మకు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొద్దిరోజుల పాటు సంయమనం పాటించాలని వర్మ వారికి సముదాయించినట్లు సమాచారం. అయితే హై కమాండ్ కు తమ నిరసన తెలియాలంటే రాజీనామా శ్రేయస్కర్మని టిడిపి కౌన్సిలర్లు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!