Wednesday, March 19, 2025

రైల్వే జోన్ సరే.. కేకే లైన్ మాటేంటి? కూటమికి ఇబ్బందికరమే!

- Advertisement -

ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో హడావిడి చేస్తోంది కూటమి ప్రభుత్వం. దశాబ్దాల కలను తాము నెరవేర్చామని రాష్ట్రంలో టిడిపి, జనసేన.. కేంద్రంలో బిజెపి ఆర్భాటం చేస్తోంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చామని.. వాల్తేర్ డివిజన్ రద్దుచేసి 410 కిలోమీటర్ల పరిధిని పెంచుతూ విశాఖ రైల్వే డివిజన్ చేశామని.. ఇలా ఎన్నెన్నో మాటలు చెబుతోంది కూటమి. అయితే ఈ విషయంలో కూటమికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రావడం లేదు. దీనికి కారణం కేకే లైన్. కొత్తవలస కిరోండాల్ లైన్ ను మాత్రం విశాఖ డివిజన్లో చేర్చలేదు. విశాఖ రైల్వే జోన్ పరిధిలో చేర్పించలేదు. దీంతో ఏపీ ప్రజలు పెదవి విరుస్తున్నారు. పైగా శ్రీకాకుళం జిల్లాలోని 49 కిలోమీటర్ల పరిధిలో రైల్వే లైన్ ను ఒడిస్సా కి విడిచిపెట్టారు. దీంతో ఆ జిల్లా ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వాల్తేరు డివిజన్ ది సుదీర్ఘ నేపథ్యం. అయితే వాల్తేర్ డివిజన్ కాస్త విశాఖ డివిజన్ గా మారింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ అందుబాటులోకి వచ్చింది. అంతవరకు ఓకే కానీ విశాఖ రైల్వే డివిజన్ పరిధిలోకి 410 కిలోమీటర్లు వచ్చి చేరింది. అయితే కీలకమైన కొత్తవలస కిరోండాల్ రైల్వే లైన్ పరిధిలో అరకు రైల్వే స్టేషన్ మాత్రం రాయగడ రైల్వే డివిజన్లో చేర్చారు. ఇది ఇబ్బందికరమైన అంశం. కీలకమైన కేకే లైన్లో రైల్వేకు యాట పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఆ రైల్వే లైన్ ను విశాఖ జోన్లో చేర్చకపోవడం లోటు.

ప్రస్తుతం ఒడిస్సాలో బిజెపి ప్రభుత్వం ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ బిజెపి ఘనవిజయం సాధించింది. దశాబ్దాల నవీన్ పట్నాయక్ ఆధిపత్యానికి గండి కొడుతూ బిజెపి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. అయితే ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామన్న బిజెపి.. రైల్వే జోన్ విషయంలో మాత్రం అదే ఒడిస్సా ప్రయోజనాలకు పెద్ద పీట వేసినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇదే ఇబ్బందికరంగా మారింది.

విశాఖ రైల్వే జోన్ కార్యాలయ భవనానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. వాల్తేర్ డివిజన్ కాస్త విశాఖ డివిజన్ గా మారింది. 410 కిలోమీటర్ల పరిధిని ఖరారు చేసింది. దీంతో ఇది కూటమి ప్రచార అస్త్రంగా మార్చుకుంది. కానీ ప్రధానమైన కేకే లైన్ ఇందులో చేర్చకపోవడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన కంటే.. కేకే లైన్ ను విస్మరించడం ఎక్కువ ప్రభావం చూపుతోంది. కూటమి ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారింది. దీనిపై బీజేపీ కూడా ఇబ్బంది పడుతోంది. ఏం చేయాలో బిజెపికి పాలుపోవడం లేదు. విశాఖకు లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చామని కూడా బిజెపి చెబుతోంది. దానిపై కూడా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మైలేజీ రావడం లేదు. మొత్తానికి అయితే రైల్వే జోన్ అంశంతో పై చేయి సాధించాలని కూటమి చూసింది. కానీ కేకే లైన్ పుణ్యమా అని అది వీలుపడలేదు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!