Saturday, October 5, 2024

జగన్‌కు మద్దతుగా వెంకయ్య నాయుడు.. పాలన భేష్ అంటూ

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న కష్టాలు చాలవు అన్నట్లుగా.. కొత్త కష్టాలు మొదలైనట్లుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న టీడీపీ అధినేతకు తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు టీడీపీకి ప్రతికూలంగా మారాయి. వెంకయ్య నాయుడు తాజాగా జగన్ సర్కార్‌కు మద్దతుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇదే ఇప్పుడు టీడీపీకి సంకటంగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకే తాటి మీద ఉంటారనే విషయం పలు సందర్భాలు కనిపించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పని పోటీ చేయడం వెనుక వెంకయ్య నాయుడు పాత్ర ఉందని అంటుంటారు. ఇదిలా ఉండగా జగన్ సీఎం అయిన తరువాత ఆయన తీసుకువచ్చిన ఇంగ్లీష్ విద్యా విధానాన్ని వెంకయ్య నాయుడు నేరుగానే వ్యతిరేకించారు.

వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. మీ పిల్లలు , మీ మనవళ్లు అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. పేదంటి పిల్లలు మాత్రం .. అలాగే ఉండలా అంటూ వెంకయ్య నాయుడుకు సెటైర్లు వేశారాయన. ఇదిలా ఉండగా .. తాజాగా వెంకయ్య నాయుడు జగన్ పాలన గురించి కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రభుత్వ పథకాలు అందాయో లేదో అని తెలుసుకోవడం.. వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకోవడం గొప్ప విషయం అని కితాబిచ్చారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. తాజాగా వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీతో పాటు, ఇటు బీజేపీ కూడా షాక్‌కు గురైయ్యాయి. తాము నిత్యం జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే… వెంకయ్య నాయుడు మాత్రం ఇలా వైసీపీ ప్రభుత్వం మీద ఇలా సానుకులంగా స్పందిస్తే ఎలా అని ఇరు పార్టీ నేతలు కూడా వెంకయ్య నాయుడును ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలతో షాక్‌లో ఉన్నారట. ఆయన పూర్తిగా డైలామాలో పడినట్లుగా పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. ఇటు వైసీపీ మాత్రం.. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలతో పూర్తి జోష్‌లో ఉన్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!