ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి… ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో చోటామోటా నాయకులతో పాటు బడా నాయకులు సైతం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి… అయితే ఇప్పటికే కొంతమంది కీలక నేతలు సైకిల్ దిగి వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…
ఇక ఇదే వరుసలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే svsn వర్మ ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఆయన త్వరలో జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి… కొద్దికాలంగా ఆయన పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.. ఈ అసంతృప్తితోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారట…
2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు… ఆ తర్వాత తిరిగి టీడీపీ తీర్థం తీసుకున్నారు… 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఓటమి చెందారు ఆ తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీ తీర్థం తీసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి…..