Thursday, December 12, 2024

భారత్,పాక్ మ్యాచ్ పై ది రాక్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీలో సంచలనాలు కూడా నమోదయ్యాయి. ఇక సూపర్ 12 మ్యాచ్ లు శనివారం నుంచి షురూ కానున్నాయి. సూపర్ 12లో ఆదివారం మెగా ఫైట్ జరగబోతోంది. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ గా చెప్పుకునే భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా భారత్, పాక్ మ్యాచ్ అంటే రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ , ఇంకా సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ ను ఫాలో అవుతారు. పొలిటికల్ సెలబ్రిటీల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ చిరకాల ప్రత్యర్థుల పోరును ఆస్వాదిస్తారు. తాజాగా భారత్ , పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. ది రాక్ గా అభిమానులకు సుపరిచితుడైన డబ్ల్యూ డబ్ల్యూఈ దిగ్గజం డ్వేన్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన కొత్త మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాక్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడినప్పుడు భారత్, పాక్ మ్యాచ్ పై స్పందించాడు. రెండు అత్యుత్తమ జట్లు తలపడుతున్నప్పుడు
ప్రపంచం చూపు మొత్తం అటువైపే ఉంటుందన్నాడు. భారత్, పాక్ మధ్య జరిగేది మ్యాచ్ కాదని, అంతకుమించి అని వ్యాఖ్యానించాడు. చివర్లో ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా,పాకిస్థాన్ అంటూ ఫ్యాన్స్ కు ఛీర్స్ చెప్పాడు. ఈ హాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ మ్యాచ్ కు సెలబ్రిటీలు సైతం అతీతులు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఐసీసీ టోర్నీల్లో తలపడినప్పుడు పాక్ పై భారత్ దే పైచేయిగా ఉంది. వన్డే ప్రపంచకప్ తో పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా రికార్డు అద్భుతంగా ఉంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాక్ తో ఆరుసార్లు తలపడిన భారత్ నాలుగింటిలో గెలిచింది. కాగా గత ఏడాది దుబాయ్ వేదిగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం భారత్ కు షాక్ తిగిలింది. ఊహించని విధంగా పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. దీంతో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదివారం మెల్ బోర్న్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైట్ టిక్కెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!