ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఇంకా ప్రభుత్వానికి 53 నెలల గడువు మాత్రమే ఉంది. అంతులేని విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత ప్రారంభమవుతోంది. దానికి కారణం ఎన్నికల హామీలు అమలు కాకపోవడమే. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలంటే హామీలు ఇచ్చారు. కానీ అందులో సామాజిక పించన్ తప్ప మరొకటి అమలు చేయలేకపోయారు. ప్రజల్లో ఆగ్రహానికి ఇదొక కారణం. అటు అభివృద్ధి సైతం ప్రకటనలకే పరిమితం అవుతోంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటు సంక్షేమము లేక.. అటు అభివృద్ధి లేకపోవడంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎగువ మధ్య తరగతి వరకు ఓకే కానీ.. మధ్యతరగతి తో పాటు సామాన్యులు ప్రభుత్వం పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారంతా యూటర్న్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తాము అధికారంలోకి వస్తే అద్భుత పాలన అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు. సంపద సృష్టించి వెంటనే పథకాలు అమలు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతూ పథకాల జోలికి వెళ్లడం లేదు. అమ్మ ఒడి ఊసు లేదు. రైతు భరోసా జాడలేదు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అంటూ బ్రమలు కల్పించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఏ ఒక్కటి ప్రకటించలేదు. ప్రజలకు అందించలేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి అయితే ప్రారంభం అయింది.
ఎన్నికల్లో జగన్ కూటమి నేతలు అష్టదిగ్బంధం చేశారు. గత ఐదేళ్లుగా రాజకీయాలకు అతీతంగా జగన్ సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. కానీ ప్రజలను మభ్యపెట్టి గెలవగలిగారు కూటమి నేతలు. అనంతపురం నుంచి సికోలు వరకు జగన్ వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. అయితే మధ్యతరగతి తో పాటు సామాన్యులు మాత్రం ఇప్పుడు కూటమిని వ్యతిరేకించడం ప్రారంభించారు. జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా సంఘటితం అవుతామని హెచ్చరిస్తున్నారు. ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ జగన్ అని చెప్తున్నారు.
రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలను గ్రహిస్తున్నారు. కూటమి ట్రాప్ లో పడి తాము మోసపోయామని భావిస్తున్నారు. ఐదేళ్లపాటు జగన్ అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం సంక్షేమాన్ని కొనసాగించిన విషయం మరిచిపోకూడదు అంటున్నారు. అనవసరంగా కూటమి హామీలను నమ్మామని.. వైసీపీని తిరస్కరించామని.. వచ్చే ఎన్నికల్లో ఆ అవసరమే లేదని.. జగన్ ఒక పక్కన నిలబడితే చాలు అని.. వైసీపీకి అద్భుత విజయం కట్టబెడతామని జనాలు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
