Monday, February 10, 2025

జగన్ పుత్రికోత్సాహం..

- Advertisement -

ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ కుటుంబంలో తొలిసారి ఓ సంతోషకర సంఘటన జరిగింది. ఆయన కుమార్తె లండన్ లో ప్రతిష్టాత్మక కింగ్స్ కళాశాలలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ ప్రధానోత్సవం లండన్ లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరయ్యారు. ఆనందంలో మునిగిపోయారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డికి హర్షా రెడ్డి, వర్షా రెడ్డి అనే కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ లండన్ లో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న కుమార్తె హర్షారెడ్డి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్నారు. లండన్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి సతీమణి భారతి తో పాటు పెద్ద కుమార్తె హర్ష రెడ్డితో కలిసి వెళ్లారు. తన కుమార్తె వర్షా రెడ్డి డిస్టింక్షన్ లో పాస్ కావడంపై జగన్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెను అభినందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. లండన్ లో ప్రతిష్టాత్మక కింగ్స్ కళాశాలలో తన కుమార్తె వర్షారెడ్డి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు జగన్. అందుకు సంబంధించి ఓ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. తన కుమార్తెను అభినందిస్తూ చేసిన పోస్టుకు వైసీపీ అభిమానులు భారీగా లైకులు, షేర్ చేస్తున్నారు.

వాస్తవానికి జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి సిబిఐ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అభ్యంతరాలు తెలిపింది. కానీ హైకోర్టు మాత్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి కీలక సూచనలు చేసింది. దీంతో జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్ లండన్ వస్తున్నారని తెలిసి ప్రవాస ఆంధ్రులు ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపారు. వేలాదిమంది జగన్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో ప్రముఖులు సైతం ఉన్నారు.

ఇప్పటికే పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఓ ముఖ్యమంత్రి కి మనవరాలిగా.. మరో సీఎంకు కుమార్తెగా ఉన్నా.. చాలా సింపుల్ సిటీకి అలవాటు పడ్డారు. ఎటువంటి ధర్పం ప్రదర్శించకుండా తన కాళ్ళ మీద తాను నిలబడతానన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. నెలకు 10 లక్షల రూపాయల వేతనం పొందుతున్నారు. ఇప్పుడు చిన్న కుమార్తె వర్షా రెడ్డి మాస్టర్ డిగ్రీ పూర్తి కావడంతో.. ఉన్నత చదువులు చదువుతూనే అక్క మాదిరిగా ఉద్యోగం చేస్తానని చెబుతున్నారు. ఇద్దరు కుమార్తెలను చూసి జగన్ ఆనందంతో పరవశిస్తున్నారు. పిల్లల ఔధర్యాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు.

జగన్ లండన్ పర్యటన పూర్తి కావడంతో ఆయన నేరుగా స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చిన వెంటనే ప్రజల్లోకి వచ్చేందుకు డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. 25 పార్లమెంట్ స్థానాల్లో.. వారానికి రెండు రోజులపాటు పర్యటించాలని ఇదివరకే నిర్ణయించారు. అందుకే జగన్ విదేశీ పర్యటన ముగింపు పై అంతా ఆసక్తి నెలకొంది.https://youtu.be/SNj_PigjnK0?si=-F7Mb8eVvDNTlY-g

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!