Wednesday, March 19, 2025

గంటాకు బొత్స ఫ్యామిలీతో చెక్.. జగన్ నయా ప్లాన్!

- Advertisement -

టిడిపి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పై జగన్మోహన్ రెడ్డి పెట్టారా? మరో సీనియర్ నేత బొత్స ఫ్యామిలీతో ఆయనకు చెక్ చెప్పనున్నారా? భీమిలి నియోజకవర్గం లో పట్టు బిగించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బొత్స ఫ్యామిలీతో జగన్ కొత్త వ్యూహం రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బొత్స కుటుంబం అక్కడ మోహరించిందని.. వచ్చే ఎన్నికల్లో అక్కడ పట్టు బిగించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గ పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

గంటా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ లీడర్. తరచూ నియోజకవర్గాలను మార్చుతుంటారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం చివరి నిమిషం వరకు ఆయనకు టికెట్ దక్కలేదు. చివరకు భీమిలి టికెట్ సాధించిన గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ రావు పై గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవంతి శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. కానీ గంటా శ్రీనివాసరావు అడ్డుకోవడంతో బ్రేక్ పడినట్లు ప్రచారం జరుగుతుంది. అవంతి శ్రీనివాసరావు పార్టీని వీడడంతో అక్కడ ఇన్చార్జి నియామకం అనివార్యంగా మారింది. అయితే అక్కడ ఇన్చార్జ్ పదవిని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది సంచలన నిర్ణయమే.

మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. బొత్సకు స్వయానా మేనల్లుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలుగు గారు. సమర్థత కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తిని భీమిలి ఇన్చార్జిగా నియమించడం మాత్రం కాస్త సంచలనమే.

మరోవైపు బొత్స ఝాన్సీ లక్ష్మి ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమెతో పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు సమాచారం. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న భీమిలి కీలకంగా మారింది. అందుకే అక్కడ మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ కు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్. అయితే భీమిలిపై పట్టు సాధించేందుకు బొత్స ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. భీమిలి లో కాపు సామాజిక వర్గం అధికం.. ఆపై విజయనగరం జిల్లాకు దగ్గరగా ఉంటుంది. బొత్స ఫ్యామిలీ అయితేనే గంటా శ్రీనివాస్ రావు కు చెక్ చెప్పవచ్చని స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!